TSIRII : అంకురాలు..ఆవిష్క‌రణ‌ల‌కు ఊతం

టీఎస్ఐఆర్ఐఐ ఆర్థిక స‌హాయం

TSIRII : ఆవిష్క‌ర్త‌ల‌కు, ఆవిష్క‌ర‌ణ‌ల‌కు, అంకురాల (స్టార్ట‌ప్ లు )కు గుడ్ న్యూస్. ప్ర‌ధానంగా ప‌ల్లె ప్రాంతాల్లో ప్ర‌జ‌లు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కారం చూపే ఆవిష్క‌ర‌ణ‌ల‌కు సాయం అందించ‌నున్న‌ట్లు తెలంగాణ ఇన్నోవేష‌న్స్ ఫ‌ర్ రూర‌ల్ ఇంపాక్ట్ ఇన్సెంటివ్స్ – టీఎస్ఐఆర్ఐఐ(TSIRII) వెల్ల‌డించింది.

ఆవిష్క‌ర్త‌ల‌తో పాటు ఇప్ప‌టికే రంగంలో ఉన్న స్టార్ట‌ప్ ల‌కు ఊతం ఇవ్వ‌నున్న‌ట్లు స్ప‌ష్టం చేసింది. ఇందుకు సంబంధించి ఆవిష్క‌ర‌ణ‌లు, స్టార్ట‌ప్ ల‌కు మ‌ద్ద‌తుగా ఉండేందుకు ప్రోత్సాహ‌కాలు అందించ‌నుంది. ఇందు కోసం రూ. 30 ల‌క్ష‌ల కార్ప‌స్ ఫండ్ కేటాయించ‌బ‌డింది.

వివిధ ద‌శ‌ల్లో ఉన్న ఆవిష్క‌ర‌ణ‌లు, అంకురాలు ఆర్థిక సాయం కోసం ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని సంస్థ కోరింది. ఈ మేర‌కు చీఫ్ ఇన్నోవేష‌న్ ఆఫీస‌ర్ డాక్ట‌ర్ శాంత తౌటం వెల్ల‌డించింది.

ఈ విష‌యాన్ని ప్ర‌క‌ట‌న ద్వారా స్ప‌ష్టం చేసింది. ప్ర‌పంచం మారుతోంది. ఎంతో మంది ప్ర‌తిభావంతులు భిన్న‌మైన ఆలోచ‌న‌లు క‌లిగి ఉన్నార‌ని పేర్కొన్నారు. గ్రామీణ స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం అనేక ఆవిష్క‌ర‌ణ‌లు వెలుగు చూస్తున్నాయ‌ని తెలిపారు.

వారికి ఆర్థిక చేయూత అందించి ప్రోత్స‌హించాల‌న్న స‌దుద్దేశంతో దీనిని ప్రారంభించామ‌ని స్ప‌ష్టం చేశారు. రాష్ట్ర ప్ర‌భుత్వం గుర్తించిన లేదా రాష్ట్రంలోనే అభివృద్ధి చేసిన ఆవిష్క‌ర‌ణ‌లు ద‌ర‌ఖాస్తు చేసుకునేందుకు అర్హులని తెలిపారు.

కాగా ఈ ఆవిష్క‌ర‌ణ‌లు, స్టార్టప్ లు కేవ‌లం ఈ ప్రాంతానికి చెందిన వాటికి సంబంధించి ఉండాల‌ని సూచించారు. ఆర్థిక చేయూత అందిస్తే మ‌రింత అభివృద్ధి చెందే అవ‌కాశం ఉంటుంద‌ని పేర్కొన్నారు.

https://teamtsic.telangana.gov.in/tsiri-incentives అనే పోర్ట‌ల్ ను సంప్ర‌దించి ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని సూచించింది. మొత్తం వ‌చ్చిన ద‌ర‌ఖాస్తుల‌ను గ్రూస్ రూట్ అడ్వైజ‌రీ కౌన్సిల్ ప‌రిశీలించి నిధులు అంద జేస్తుంద‌ని స్ప‌ష్టం చేసింది.

Also Read : దాతృత్వమా క‌ల‌కాలం వ‌ర్ధిల్లుమా

Leave A Reply

Your Email Id will not be published!