VP Dhankar : విదేశీ యూనివర్శిటీలపై ధన్ ఖర్ ఫైర్
భారత దేశం పట్ల వ్యతిరేకత ప్రచారం
VP Dhankar : దేశ ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ ఖర్ సంచలన కామెంట్స్ చేశారు. విదేశీ యూనివర్శిటీలపై నిప్పులు చెరిగారు. రహస్య ఎజెండాను అమలు చేస్తున్నాయని ఆరోపించారు. భారత రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసేలా కామెంట్స్ చేసేలా ప్రోత్సహిస్తున్నాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు. భారత దేశ సార్వభౌమత్వాన్ని కాపాడాల్సిన బాధ్యత పార్లమెంట్ పై ఉందని ఉప రాష్ట్రపతి స్పష్టం చేశారు.
దేశ నాగరికత నైతికతను కూల్చి వేసి దాని ఎదుగుదలపై బురద జల్లేందుకు భారత వ్యతిరేక కార్యకలాపాలకు కేంద్రాలుగా కొన్ని విదేశీ విశ్వ విద్యాలయాలు రెట్టింపు అవుతున్నాయని మండిపడ్డారు. వాటితో సహా సంస్కృతిపై దాడి కూడా కొనసాగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. భారత దేశంలోని ఉన్నత వర్గాలు అని పిలువబడే వారి రహస్య ఎజెండాలో కలవర పెట్టే అంతర్దృష్ణులు ఆందోళనకరంగా ఉన్నాయని పేర్కొన్నారు.
ఈ తరుణంలో భారత దేశ జాతీయ సార్వ భౌమత్వాన్ని, సాంస్కృతిక సమగ్రతను , అంతర్లీనంగా లేదా బాహ్యంగా ఎలాంటి బెదిరింపుల నుండి రక్షించడం పార్లమెంట్ బాధ్యత అని పేర్కొన్నారు ఉప రాష్ట్రపతి. గురువారం 16వ సివిల్ సర్వీసెస్ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో జగదీప్ ధన్ ఖర్(VP Dhankar) ప్రసంగించారు.
పార్లమెంట్ మాత్రమే చట్టానికి ఇంఛార్జ్ అని దానిని అమలు చేసేందుకు సమర్థత కలిగి ఉందన్నారు. ఇటీవల పదే పదే న్యాయ వ్యవస్థ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీజేఐకి కేంద్ర న్యాయ శాఖ మంత్రికి, ఉప రాష్ట్రపతికి మధ్య మాటల యుద్దం కూడా కొనసాగింది.
Also Read : డబ్బులు దొరకలేదు బెయిల్ ఇవ్వండి