Vundavalli Arun Kumar : స‌త్తా ఉన్నోడు కేసీఆర్ – ఉండ‌వ‌ల్లి

మాజీ ఎంపీ సంచ‌ల‌న కామెంట్స్

Vundavalli Arun Kumar : కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్ షాకింగ్ కామెంట్స్ చేశారు. దేశ రాజ‌కీయాల‌పై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. కేంద్రంలోని మోదీ బీజేపీ సంకీర్ణ ప్ర‌భుత్వం అవ‌లంభిస్తున్న విధానాలు అత్యంత ప్ర‌మాద‌క‌రంగా ఉన్నాయ‌ని హెచ్చ‌రించారు.

మోదీ రాచ‌రిక పాల‌న సాగిస్తున్నార‌ని అన్నారు. ఇవాళ ప్ర‌ధాన మంత్రికి వ్య‌తిరేకంగా మాట్లాడే వ్య‌క్తులు లేకుండా పోయార‌ని పేర్కొన్నారు.

సోమ‌వారం విజ‌య‌వాడ‌లో ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్(Vundavalli Arun Kumar) మీడియాతో మాట్లాడారు. ఈ త‌రుణంలో ప్ర‌జ‌ల‌ను క‌మ్యూనికేట్ చేయ‌గ‌లిగిన స‌త్తా తెలంగాణ సీఎం కేసీఆర్ కు ఉంద‌ని కితాబు ఇచ్చారు.

2012లో ఎంపీగా క‌లుసుకున్నాం. ఆ త‌ర్వాత క‌లుసుకునే చాన్స్ లేకుండా పోయంద‌న్నారు. తాను రాజ‌కీయాల నుంచి ఎప్పుడో రిటైర్ అయ్యాన‌ని చెప్పారు.

అయితే సీఎం కేసీఆర్ 10 రోజుల కింద‌ట ఫోన్ చేశారు. రండి మాట్లాడుకుందామంటూ ఆహ్వానించారు. హైద‌రాబాద్ కు వెళ్లాను. మంత్రి హ‌రీష్

రావు రిసీవ్ చేసుకున్నారు.

అర్ద‌గంట సేపు మాట్లాడారు. అనంత‌రం సీఎం కేసీఆర్ లోప‌లికి తీసుకు వెళ్లారు. మీరు ప్యూర్ విజిటేరియ‌న్ క‌దూ అంటూ భోజ‌నం పెట్టారు. మా ఇద్ద‌రి మ‌ధ్య మూడు గంట‌ల‌కు పైగా చ‌ర్చ‌లు జ‌రిగాయి.

ఆయ‌న‌కు ప్ర‌తి విష‌యంపై ప‌ట్టుంది. అంత‌కంటే ఎక్కువ‌గా స‌మాచారం ఉంది. దేశానికి సంబంధించిన కేసీఆర్ పూర్తిగా డేటా తీసి పెట్టుకున్నారు.

తాను బీజేపీ విధానాల‌ను మొద‌టి నుంచి వ్య‌తిరేకిస్తూ వ‌స్తున్నా. తాను కూడా వ్య‌తిరేకిస్తూ వ‌స్తున్నారు. ఇక మీరు అనుకుంటున్న‌ట్లు మా

ఇద్ద‌రి మధ్య జాతీయ పార్టీ గురించిన ప్ర‌స్తావ‌న అన్న‌ది రాలేద‌న్నారు ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్(Vundavalli Arun Kumar).

దేశంలో మీరు అనుకుంటున్న‌ట్లు బీజేపీ ఎక్క‌డా బ‌లంగా లేద‌ని కానీ ఏపీలో మాత్రం దాని శ‌క్తి ఎక్కువ‌గా ఉంద‌న్నారు. ఇక ఈ చ‌ర్చ‌ల్లో

పొలిటిక‌ల్ స్ట్రాట‌జిస్ట్ పీకే కూడా ఉన్నార‌ని, ఆయ‌న ఎలాంటి జోక్యం చేసుకోలేద‌న్నారు.

మ‌రోసారి క‌లుద్దామ‌ని అన్నార‌ని, తాను వీలు కుదిరితే త‌ప్ప‌కుండా వ‌స్తాన‌ని చెప్పాన‌ని తెలిపారు మాజీ ఎంపీ. బీజేప‌కి ఆల్ట‌ర్నేటివ్ శ‌క్తి ని త‌యారు చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు.

Also Read : మోదీ స‌ర్కార్ కు మూడింది – రేవంత్

Leave A Reply

Your Email Id will not be published!