KS Eshwarappa : మాజీ మంత్రి ఈశ్వరప్పకు వార్నింగ్
నాలుక కోస్తామంటూ హెచ్చరిక లేఖ
KS Eshwarappa : కేంద్రంలో బీజేపీ కొలువు తీరాక మత, కుల ఘర్షణలు మరింత పెరిగాయి. ఇది ఎవరు ఔనన్నా కాదన్నా వాస్తవం. ఎక్కడ చూసినా మాటల తూటాలు పేలుతున్నాయి.
ప్రధానంగా ముస్లిం, హిందువుల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనేలా ఉంది. తెలంగాణలో ఓ బీజేపీ ఎమ్మెల్యే చేసిన కామెంట్స్ కలకలం రేపాయి. చివరకు పార్టీ దిద్దుబాటు చర్యలకు దిగింది. పార్టీ నుంచి 10 రోజుల పాటు సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది.
మరో వైపు పక్కనే ఉన్న కర్ణాటకలో హిజాబ్ వివాదం చల్లారక ముందే ఇప్పటికే బీజేవైఎం కార్యకర్తను దారుణంగా హత్య చేశారు. ఆపై ఓ ముస్లిం వర్గానికి చెందిన యువకుడు హత్యకు గురయ్యాడు.
ఇదే క్రమంలో కర్ణాటక మాజీ మంత్రి కే. ఈశ్వరప్ప(KS Eshwarappa) ఆ మధ్యన షాకింగ్ కామెంట్స్ చేశారు. ముస్లిం వర్గాలు సంయమనం పాటించాలని గీత దాటితే తట్టుకోవడం కష్టమని హెచ్చరించారు.
ఆయన వ్యాఖ్యలు కలకలం రేపాయి. ప్రధానంగా టిప్పు సుల్తాన్ విషయంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల వ్యవహారం తీవ్ర దుమారానికి దారి తీసింది. ఈ ఘటన ఆగస్టు 15న చోటు చేసుకుంది.
టిప్పు సుల్తాన్ తో పాటు ఆర్ఎస్ఎస్ సిద్దాంతకర్త వీడీ సావర్కర్ ఫోటోలు ఉండడం తీవ్ర దుమారానికి దారి తీశాయి. ముస్లిం యువకులు జాగ్రత్తగా ఉండాలని లేక పోతే సీరియస్ గా స్పందించాల్సి వస్తుందని హెచ్చరించారు.
ఈ తరుణంలో కేఎస్ ఈశ్వరప్పకు తాజాగా ఓ బెదిరింపు లేఖ వచ్చింది. ఆయన టిప్పు సుల్తాన్ ను ముస్లిం గుండా అని పేర్కొనడాన్ని తప్పు పట్టారు. ఈ విషయంపై ఫిర్యాదు చేశారు.
పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తాను ఎలాంటి బెదిరింపులకు భయపడనని స్పష్టం చేశారు.
Also Read : బిల్కిస్ బానో కోసం మళ్లీ గొంతెత్తాడు