Meghalaya CM : మెజార్టీ ఖాయం సర్కార్ తథ్యం – సీఎం
కాన్రాడ్ సంగ్మా సంచలన కామెంట్స్
Meghalaya CM Conrad Sangma : మేఘాలయలో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మెజారిటీని సాధించగలమని స్పష్టం చేశారు సీఎం కాన్రాడ్ సంగ్మా. ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ సందర్భంగా జరిగిన ప్రచారంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఇదిలా ఉండగా రాష్ట్రంలో పదవీ కాలాన్ని పూర్తి స్థాయిలో మూడో సీఎం సంగ్మా కావడం విశేషం. ప్రజలు తమ పట్ల పూర్తిగా సానుకూలతతో ఉన్నారని చెప్పారు. మొత్తం రాష్ట్రంలో 67 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. ఫిబ్రవరి 27న ఎన్నికలు జరగనున్నాయి.
ఈసారి ఎన్నికల్లో పూర్తి ఆధిక్యతను ప్రదర్శిస్తామని, అంతే కాకుండా రెండోసారి కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలమన్న నమ్మకాన్ని ప్రకటించారు కాన్రాడ్ సంగ్మా. గతంలో ఎన్నడూ లేనంతగా అభివృద్ది చేశామని చెప్పారు సీఎం. ప్రతిచోటా ప్రభుత్వ పని తీరు పట్ల ప్రజలు చాలా సంతోషంతో ఉన్నారని అన్నారు. ఇది తమకు సానుకూలత కలిగించే అతి ముఖ్యమైన అంశమని పేర్కొన్నారు సీఎం కాన్రాడ్ సంగ్మా.
గత ఐదేళ్ల కాలంలో తమ పార్టీ అన్ని రకాలుగా అభివృద్దికి ప్రయారిటీ ఇచ్చింది. శాంతి భద్రతల పరిస్థితి మెరుగు పడింది. దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న సమస్యల పరిష్కారానికి తమ ప్రభుత్వం చొరవ తీసుకుందని చెప్పారు మేఘాలయ సీఎం (Meghalaya CM Conrad Sangma). రాష్ట్రంలో ప్రస్తుతం ప్రతిపక్షాలు కూడా బలీయంగా ఉన్నాయని అన్నారు.
వారిని ఎదుర్కొని ముందుకు సాగుతామన్న నమ్మకం తనకు ఉందని సీఎం స్పష్టం చేశారు. ఒక్కోసారి అనుకున్నంత మేర ఫలితాలు కూడా రాక పోవచ్చన్నారు. ఎవరు ఎన్ని రకాలుగా ఆరోపణలు చేసినా అంతిమంగా విజయం తమదేనని ధీమా వ్యక్తం చేశారు.
Also Read : మాకు ఎలాంటి ఎజెండా లేదు – బీబీసీ