Yogi Adityanath : యూపీలో మళ్లీ పవర్ లోకి వస్తాం. ఇప్పుడు బయట తిరుగుతున్న నేరస్తుల తాట తీస్తామని హెచ్చరించారు సీఎం యోగి ఆదిత్యానాథ్(Yogi Adityanath). యూపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ప్రసంగించారు.
ఈ ఎన్నికల సీజన్ లో నేరస్తులు అక్రమంగా సంపాదించిన ఆస్తులపై బుల్ డోజర్లను మరోసారి ప్రయోగిస్తామని ప్రకటించారు. ఇవాళ మెయిన్ పురిలో భారీ ర్యాలీ చేపట్టారు బీజేపీ ఆధ్వర్యంలో.
ఎన్నికల సమయంలో నేరస్థుల ఆస్తులపై ప్రభుత్వం బుల్ డోజర్లను నడపలేదంటూ సమాజ్ వాది పార్టీ తనకు మరోసారి గుర్తు చేసిందన్నారు.
గత నాలుగున్నర సంవత్సరాలుగా దాక్కున్న వారందరికీ వచ్చే మార్చి 10 తర్వాత తాము బుల్డోజర్లను ఉపయోగిస్తామని హెచ్చరించారు.
ఎన్నికలు జరుగుతున్నాయని తాము మౌనంగా ఉన్నామని కానీ ఇప్పుడు ఆ సీన్ లేదన్నారు. ఈ ఎన్నికల సీజన్ లో ఆయన పదే పదే నేరస్థులను ఆట కట్టించిన విధానం గురించి ఎక్కువగా ప్రచారం చేశారు.
ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేయడంలో పాల్గొన్న నిరసనకారులకు రికవరీ నోటీసులు పంపిస్తామని స్పష్టం చేశారు యోగి ఆదిత్యానాథ్(Yogi Adityanath). యంత్రాలకు కూడా కొంత విశ్రాంతి అవసరం అన్నారు.
రాష్ట్రంలో మరోసారి అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు సీఎం. అందుకే తాత్కాలికంగా నిలిపి వేశామని, ఆ తర్వాత అవి తిరిగి తమ పని తాము చేసుకుంటూ పోతాయన్నారు.
గతంలో అరాచక పాలన సాగిందని, నేరస్థుల అడ్డాగా మార్చేశారని కానీ తాను పవర్ లోకి వచ్చాక ఎలాంటి అల్లర్లు చోటు చేసుకోలేదన్నారు యోగి ఆదిత్యానాథ్.
Also Read : మోదీజీ ఆర్థిక నేరగాళ్లపై చర్యలేవి