Ashok Gehlot : సంక్షేమానికే బడ్జెట్ లో ప్రయారిటీ
రాజస్తాన్ సీఎం అశోక్ గెహ్లాట్
Ashok Gehlot : రాజస్థాన్ లో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వం కొలువు తీరింది. సీఎం అశోక్ గెహ్లాట్ సారథ్యంలోని సర్కార్ కీలకమైన బడ్జెట్ ను ప్రవేశ పెట్టనుంది. ఇందులో భాగంగా ప్రవేశ పెట్టే బడ్జెట్ లో పూర్తిగా ప్రజా సంక్షేమానికి ప్రయారిటీ ఇవ్వనుంది. ఇందుకు సంబంధించి బచత్..రహత్..బాధత్ అంటే పొదుపు..ఉపశమనం..శ్రేయస్సు అనే పేరుతో ఆకర్షణీయమైన ట్యాగ్ లైన్ కూడా జత చేశారు సీఎం అశోక్ గెహ్లాట్(Ashok Gehlot) .
ఇదిలా ఉండగా వచ్చే ఏడాది ఫిబ్రవరిలో రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే విస్తృతంగా ప్రచారాన్ని చేపట్టింది కాంగ్రెస్ పార్టీ. సీఎం అశోక్ గెహ్లాట్ చిరునవ్వుతో కూడిన హోర్డింగ్ లు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు.
ఆర్థిక శాఖను కూడా కలిగి ఉన్న సీఎం ఉదయం 11 గంటలకు బడ్జెట్ ను సమర్పిస్తారు. ఈ సందర్బంగా అశోక్ గెహ్లాట్(Ashok Gehlot) కీలక వ్యాఖ్యలు చేశారు. రాజస్థాన్ బడ్జెట్ పొదుపు , ఉపశమనం, పురోగతి తెస్తుందన్నారు. రాష్ట్రంలోని ప్రతి వ్యక్తికి బచత్ , రహత్ ..బాదత్ కు భరోసా ఇచ్చే తీర్మానంతో 2023 బడ్జెట్ ను ఖరారు చేస్తుందని స్పష్టం చేశారు సీఎం అశోక్ గెహ్లాట్.
ఇందుకు సంబంధించి బడ్జెట్ కు ముందు చీఫ్ విప్ మహేష్ జోషి మాట్లాడారు. ఇంత ఉత్సాహంతో , శక్తితో ఒక సీఎం బడ్జెట్ ను ప్రవేశ పెట్టడం ఇదే మొదటిసారి అని పేర్కొన్నారు. ఈ బడ్జెట్ లో పొదుపు, ఉపశమనం, ఆదాయాల పెంపుదల భావన ప్రజల ముందు పెట్టామని స్పష్టం చేశారు.
Also Read : నెహ్రూ పేరెందుకు పెట్టుకోలేదు