Ukraine President : ఉక్రెయిన్ పై ఏకపక్ష దాడులకు పాల్పుడుతూ భయభ్రాంతులకు గురి చేస్తున్న రష్యాపై ప్రపంచం మొత్తం ఈసడించుకుంటోంది. వెంటనే యుద్దాన్ని ఆపాలని కోరుతోంది.
ఐక్యరాజ్య సమితి సైతం మారణ హోమాన్ని ఎంత త్వరగా మానుకుంటే అంత మంచిదని తెలిపింది. ఈ తరుణంలో తాము యుద్దాన్ని కోరుకోవడం లేదని, శాంతియుత చర్చలకు సిద్దంగానే ఉన్నామని ప్రకటిస్తూనే వచ్చారు ఉక్రెనియన్ చీఫ్ జెలెన్స్కీ(Ukraine President ).
కానీ పోరాటం మాత్రం ఆపనని స్పష్టం చేశాడు. ఇంకొకరైతే యుద్ద సమయంలో పారి పోయే వారు. లేదా తల దాచుకునే వారు. కానీ మనోడు ఇంకా పోరాటానికి సై అంటున్నాడు.
తాజాగా సెల్ఫీ వీడియోను విడుదల చేశాడు. ప్రస్తుతం అది సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. హృదయ విదారకమైన దృశ్యాలు యావత్ లోకాన్ని కలిచి వేస్తున్నాయి.
మన స్వేచ్చను, స్వతంత్రతను కాపాడు కునేందుకు తామంతా సాయుధులమై ఉన్నామని ప్రకటించాడు. రష్యా దాడుల నుంచి దేశ రాజధానిని కాపాడుకుంటామని స్పష్టం చేశాడు. తాము ఏరోజూ యుద్దానికి కాలు దువ్వలేదన్నాడు.
రష్యానే కావాలని తమను టార్గెట్ చేసిందంటూ ఆరోపించాడు. ఆ దేశ కేపిటల్ సిటీ కైవ్ సెంట్రల్ హాల్ నుంచి సెల్ఫీ షాట్ విడుదల చేశారు. మేమంతా ఇక్కడే ఉన్నాం. మా సైన్యం నాతో పాటే ఉంది.
సమాజంలోని పౌరులంతా ఇక్కడే ఉన్నారు. ఈ దేశాన్ని కాపాడుకుంటామని చెప్పాడు. ఆయన ఆలివ్ ఆకుపచ్చ మిలటరీ దుస్తులు ధరించి ఉండడం విశేషం.
ప్రస్తుతం ఉక్రేనియన్ చీఫ్ విడుదల చేసిన ఈ వీడియో సందేశం హల్ చల్ చేస్తోంది.
Also Read : అంతరిక్ష కేంద్రం కూల్చేస్తాం