TTD Laddu: వెంక‌న్న‌ ప్ర‌సాదాలు గోవిందా?

TTD Laddu:ఆధ్యాత్మిక‌త‌కే కాదు అణువ‌ణువునా ప్ర‌కృతి ర‌మ‌ణీయ‌త ప‌దిల ప‌ర‌చుకున్న తిరుమ‌ల తిరుప‌తిలో దేవ‌దేవుడైన క్దఆ శ్రీ‌నివాసుని ద‌‌ర్శించుకుని వ‌చ్చే ప్ర‌తి భ‌క్తులు ఆస‌క్తిగా ఎదురుచూసేది బాలాజీ ప్ర‌సాదం కైంట‌ర్ల వైపే.

TTD Laddu: ఆధ్యాత్మిక‌త‌కే కాదు ప్ర‌కృతి  ర‌మ‌ణీయ‌త ప‌దిల ప‌ర‌చుకున్న తిరుమ‌ల తిరుప‌తిలో దేవ‌దేవుడైన క్దఆ శ్రీ‌నివాసుని ద‌‌ర్శించుకుని వ‌చ్చే ప్ర‌తి భ‌క్తులు ఆస‌క్తిగా ఎదురుచూసేది బాలాజీ ప్ర‌సాదం కైంట‌ర్ల వైపే. ద‌ర్శ‌నం టోకెన్ల‌తో పాటు అద‌న‌పు ప్ర‌సాదం టోకెన్లు కొనుకున్నవారు త‌మ ప‌ర భేదం లేకుండా వ‌రుస‌లో నిల‌బ‌డి క్ర‌మ‌శిక్ష‌ణ‌తో ముందుకు న‌డుస్తూ త‌మ వంతు వ‌చ్చే వ‌ర‌కూ వేచి ప్ర‌సాదం అందుకోవ‌టం ఓ భ‌గ‌వ‌త్ కార్యంగా భావించే భ‌క్తులు ఇక్క‌డే క‌నిపిస్తారు.

నిజ‌మే… ఆ దేవ‌ దేవుని స‌న్నిధిలో ప్ర‌సాదం అందుకోవ‌టం , తినడం, సొంత ఊళ్ల‌కెళ్లాక అంద‌రికీ త‌మ ద‌ర్శ‌న విశేషాలు చెపుతూ ప్ర‌సాదం అందించ‌డం ఓ మ‌హ‌ద్భాగ్యంగా భావిస్తారు. అందుకే తిరుమ‌ల శ్రీ‌వారికి ఎంత పేరుందో… అదే స్ధాయి పేరు ప్ర‌ఖ్యాతులు తిరుమ‌ల ప్ర‌సాదంకు పేరు. దీనికి తోడు ఆల‌య ప్రాంగ‌ణంలో అందించే ప్ర‌సాదం ఆదో రుచి. ఆధ్యాత్మిక మేళ‌వింపు అనటంలో సందేహం లేదు.

కానీ గంగాళాల‌ కొద్దీ ప్ర‌సాదం త‌యార‌వుతున్నా… లోప‌లి ప్ర‌సాదం కౌంట‌ర్ల‌లో మాత్రం భ‌క్తుల చేతిలో విద‌లింపులు కూడా జ‌ర‌గ‌క పోవ‌టంతో భ‌క్తులు ఆల‌య ప్రాంగ‌ణంలోనే అధికారుల‌పై తిర‌గ‌బ‌డిన ఘ‌ట‌న ఆదివారం చోటు చేసుకుంది. ఓ భ‌క్తుడు తిరుమ‌ల నుంచి ఇచ్చిన స‌మాధానం ఆధారంగా చూస్తే…. ఆల‌య లోపలి ప్ర‌సాదం కౌంట‌ర్ల‌లో చిన్న చిన్న ఆకు ప్లేట్ల‌లో ప్ర‌సాదం అందించ‌డం సాధార‌ణంగా జ‌రిగే అంశం, కానీ ఆదివారం ఉద‌యం మాత్రం ఏదో త‌ప్ప‌దు అన్న తీరుగా ఆకు ప్లేట్ల‌లో ఏదో పెట్ట‌మ‌న్న తీరుగా విదిలించ‌డ‌మే వాగ్విదానికి తావిచ్చింది. ఇదేమ‌ని ప్ర‌శ్నించిన పాపానికి అక్క‌డి పంపిణీ సిబ్బంది ప్ర‌సాదం అంటే కొద్దిగా ఇస్తారు మిన‌హా న‌చ్చినంత ఇస్తారా అంటూ భ‌క్తుల‌పై ఎదురు దిగారు. గ‌త వైభ‌వాన్ని త‌ల‌చుకున్న భ‌క్తులు ల‌క్ష‌లాది కోట్లు కానుక‌ల రూపంలో అందుతున్నా తితిదే సిబ్బంది క‌నీస ప్ర‌సాదం కూడా అందించ‌లేని ప‌రిస్థితిలో ఉందా? అంటూ నిల‌దీసారు.

అయితే మాకు వ‌చ్చిన ప్ర‌సాదం అంద‌రికీ పంచ‌డ‌మే మా విధి అంటూ పంపిణీ సిబ్బంది రెచ్చిపోవ‌టం చూస్తుంటే … అస‌లు ఉచిత ప్ర‌సాదం విష‌యంపై పాల‌క మండ‌లి కోత విధించింద‌న్న అనుమానం క‌లుగుతోంద‌ని, భ‌క్తులు చెపుతున్న‌ స‌మాచారాన్ని ఆధారంగా ఈ పోస్టు చేస్తున్నాం.

No comment allowed please