Wheat Price Hike : రికార్డు స్థాయికి గోధుమల ధరలు
ఎగుమతిపై కేంద్ర సర్కార్ నిషేధం ప్రభావం
Wheat Price Hike : కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కారణంగా రైతులు పండించిన గోధుమలకు భలే గిరాకీ ఏర్పడింది. భారత దేశం నుంచి గోధుమల్ని ఎగుమతి చేయడాన్ని నిషేధిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
దాంతో నిషేధం ప్రభావం కారణంగా గోధుమల ధరలు రికార్డు(Wheat Price Hike) స్థాయికి చేరుకున్నాయి. ప్రధాన గోధుమ ఎగుమతిదారుగా ఉన్న ఉక్రెయిన్ పై రష్యా యుద్ధానికి దిగింది.
ఈ నేపథ్యంలో ఇప్పటికే ఎక్కువగా ఉన్న ధర యూరోపియన్ మార్కెట్ లో టన్నుకు 435 యూరోలు పెరిగింది. ఇక దేశంలో ఉత్పత్తి దెబ్బ తినడంతో కమోడిటీ ఎగుమతుల్ని నిషేధించాలని భారత దేశం నిర్ణయించింది.
సోమవారం ఒక్క రోజే భారీ ఎత్తున గోధుమ ధరలు రికార్డు(Wheat Price Hike) స్థాయికి చేరుకున్నాయి. ఇదిలా ఉండగా స్వదేశంలో పెరుగుతున్న ధరలను నియంత్రించేందుకు చర్యలకు దిగింద సర్కార్.
ఇందులో భాగంగా తక్షణమే గోధుముల ఎగుమతులపై బ్యాన్ విధించినట్లు స్పష్టం చేసింది. జారీ చేసిన నోటిఫికేషన్ లేదా అంతకు ముందు క్రెడిట్ లెటర్స్ జారీ చేసిన ఎగుమతి షిప్ మెంట్ లకు మాత్రమే అనుమతి ఉంటుందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఈ మేరకు నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. ఈ విషయాన్ని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ జారీ చేసిన ఉత్తర్వులలో వెల్లడించింది కూడా.
ఇందులో ప్రధానంగా దేశానికి సంబంధించి ఆహార భద్రతను నిర్వహించేందుకు పొరుగు, ఇతర బలహీన దేశాల అవసరాలకు మద్దతు ఇచ్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
ధరల పెరుగుదలతో ఒక రకంగా రైతులకు మేలు చేకూరనుంది.
Also Read : గోధుమల ఎగుమతులపై భారత్ నిషేధం