Rahul Gandhi : రాహుల్ గాంధీ ఓటు ఎటు వైపు

17న పార్టీ అధ్య‌క్ష ప‌ద‌వి ఎన్నిక‌

Rahul Gandhi : ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ప‌ద‌వికి ఎన్నిక అక్టోబ‌ర్ 17న జ‌ర‌గ‌నుంది. ఇంకా పోలింగ్ జ‌రిగేందుకు కొన్ని గంట‌లు మాత్ర‌మే ఉంది. ఆ పార్టీ మాజీ చీఫ్‌, వాయ‌నాడు ఎంపీ రాహుల్ గాంధీ(Rahul Gandhi)  సుదీర్ఘ పాద‌యాత్ర చేప‌ట్టారు. ప్ర‌స్తుతం ఆయ‌న త‌మిళ‌నాడు, కేర‌ళలో పూర్తి చేసుకున్నారు.

ప్ర‌స్తుతం క‌ర్ణాట‌క‌లో కొన‌సాగుతో పాద‌యాత్ర‌. ఏపీలో కూడా యాత్ర కొన‌సాగింది. ఇక తెలంగాణ‌లో 12 రోజుల పాటు యాత్ర ఉంటుంద‌ని స‌మాచారం. ఇది ప‌క్క‌న పెడితే 24 ఏళ్ల సుదీర్ఘ విరామం త‌ర్వాత గాంధీ యేత‌ర వ్య‌క్తుల‌లో ఎవ‌రో ఒక‌రు పార్టీకి చీఫ్ ఎన్నిక కానున్నారు. గాంధీ కుటుంబానికి విధేయుడిగా పేరొందిన ఎంపీ మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే బ‌రిలో ఉన్నారు.

ఇక అస‌మ్మ‌తి వ‌ర్గంగా పేరొందిన జీ23 నుంచి తిరువ‌నంత‌పురం ఎంపీ శ‌శి థ‌రూర్ పోటీలో నిలిచారు. ఇద్ద‌రూ పెద్ద ఎత్తున ప్ర‌చారం చేప‌ట్టారు. ఇప్ప‌టికే సోనియా గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు రాహుల్ గాంధీ(Rahul Gandhi)  ఢిల్లీలో ఓటు వేస్తారా లేక క‌ర్ణాట‌క‌లో ఏర్పాటు చేసే పోలింగ్ బూత్ లో త‌న ఓటు హ‌క్కు వినియోగించు కుంటారా లేదా అన్న‌ది ఉత్కంఠ నెల‌కొంది పార్టీ వ‌ర్గాల‌లో.

ఇప్ప‌టికే పోలింగ్ ఏర్పాట్ల‌ను పూర్తి చేశారు ఎన్నిక‌ల ప్రిసైడింగ్ ఆఫీస‌ర్ మ‌ధుసూద‌న్ మిస్త్రీ. మొత్తం 9,000 మంది త‌మ ఓటు హ‌క్కును వినియోగించు కోనున్నారు. అయితే అటు ఖ‌ర్గే ఇటు శ‌శి థ‌రూర్ ఇద్ద‌రూ త‌న‌కు కావాల్సిన వాళ్లే. మ‌రి యువ నాయ‌కుడి మ‌దిలో ఏముందో ఎవ‌రికి ఎరుక‌. త‌ట‌స్థంగా ఉంటారా లేక ఓటు ఎవ‌రికి వేస్తార‌నేది చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

Also Read : కేంద్ర స‌ర్కార్ పై స్టాలిన్ సీరియ‌స్

Leave A Reply

Your Email Id will not be published!