CA Buchi Babu : ఎవరీ ‘గోరంట్ల’ ఏమిటా కథ
కీలకంగా మారిన ఢిల్లీ స్కాం
CA Buchi Babu : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది ఢిల్లీ లిక్కర్ స్కాం. మద్యం పాలసీలో అక్రమాలు చోటు చేసుకున్నాయంటూ దీనిపై విచారణ జరిపించాలని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐని ఆదేశించారు.
రంగంలోకి దిగిన సీబీఐ 34 మందిపై అభియోగాలు మోపింది. ఇందులో మనీ లాండరింగ్ వ్యవహారం చోటు చేసుకుందని తేల్చింది. ప్రత్యేక కోర్టులో సమర్పించిన ఛార్జ్ షీట్ లో సంచలన విషయాలు బట్టబయలు చేసింది. 11 మందిని అరెస్ట్ చేసింది. ఇందులో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను కూడా తీహార్ జైలుకు పంపింది.
ఢిల్లీ మద్యం కుంభకోణంలో కీలక పాత్ర పోషించింది సౌత్ గ్రూప్. ఇందులో తెలంగాణ సీఎం కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సంబంధం ఉందంటూ ఆరోపించింది. ఇదే కేసులో డబ్బులు చేతులు మార్చడంలో ముఖ్యమైన భూమికను పోషించారు గోరంట్ల బుచ్చిబాబు.
పలు కంపెనీలు, ప్రముఖులు, వ్యాపారవేత్తలకు కూడా ఆడిటర్ గా సేవలు అందించారు. బుచ్చిబాబు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు పని చేశారు. రూ. 100 కోట్లు చేతులు మారడంలో వ్యవహారం నడిపాడని ఈడీనే తేల్చింది.
గతంలో ఎమ్మెల్సీ కవితకు ఆడిటర్ గా ఉంటూ చక్రం తిప్పాడు. దీనిని గుర్తించింది ఈడీ. బుచ్చిబాబును(CA Buchi Babu) హైదరాబాద్ లో అదుపులోకి తీసుకుంది. ఢిల్లీకి రమ్మని కోరింది. అక్కడే అరెస్ట్ చేసింది.
కస్టడీలోకి తీసుకున్న తర్వాత అసలు కథంతా నడిపిందంతా ఎమ్మెల్సీ కవితేనని చెప్పినట్లు సమాచారం. సౌత్ గ్రూప్ లో బుచ్చిబాబు, కవిత, రామచంద్రన్ పిళ్లై , ఎంపీ మాగుంట కొడుకును కూడా అరెస్ట్ చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఇప్పుడు కవితతో పాటు బుచ్చిబాబును విచారించనుంది ఈడీ.
Also Read : జనార్దన్ రెడ్డిని బర్తరఫ్ చేయాలి