Nathan Anderson : హిండెన్‌బర్గ్ కథేంటి ఆండర్సన్ ఎవరు
అదానీ గ్రూప్ కు 85 వేల కోట్ల నష్టం
Nathan Anderson : ప్రపంచ కుబేరుల జాబితాలో టాప్ లో ఉన్న గౌతం అదానీ నేతృత్వంలోని అదానీ గ్రూప్ కు కోలుకోలేని షాక్ ఇచ్చాడు ఒకే ఒక్కడు నాథన్ ఆండర్సన్(Nathan Anderson) .
ఏకంగా ఆయన సారథ్యంలోని అమెరికాకు చెందిన హిడెన్ బర్గ్ రీసెర్చ్ గ్రూప్ పేల్చిన ప్రకటన ఒక్కసారిగా అదానీ సామ్రాజ్యంలో కదలికలు వచ్చేలా చేసింది. అదానీ గ్రూప్ లెక్కలన్నీ తప్పులేనంటూ ప్రకటించాడు. దెబ్బకు అదానీ గ్రూప్ కు ఏకంగా రూ. 85 వేల కోట్లు నష్ట పోయింది. హిడెన్ బర్గ్ రీసెర్చ్ సంస్థను స్థాపించాడు నాథన్ ఆండర్సన్ .
దీనిని 2017లో ప్రారంభించాడు. ఆనాటి నుంచి నేటి దాకా సంచలనాలకు కేంద్ర బిందువుగా మారి పోయింది. అమెరికాలో షార్ట్ సెల్లింగ్ సంస్థగా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ప్రతికూల నివేదిక కారణంగా అదానీ గ్రూప్ షేర్లు భారీగా పడి పోవడానికి కారణమయ్యాడు నాథన్ ఆండర్సన్.
ఆసియా ఖండంలోనే అతి పెద్ద కుబేరుడిగా గుర్తింపు పొందిన గౌతమ్ అదానీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. బ్లూమ్ బెర్గ్ బిలియనీర్ ఇండెక్స్ ప్రకారం అదానీ నికర విలువ $113 బిలియన్లకు పైగా తగ్గింది. దీంతో ప్రపంచ కుబేరుల జాబితాలో టాప్ లో ఉన్న గౌతమ్ అదానీ ఉన్నట్టుండి 4వ స్థానానికి పడి పోయాడు. అదానీ గ్రూప్ లో ఏ లెక్క సరిగా లేదంటూ ఆరోపించింది హిడెన్ బర్గ్ రీసెర్స్ సంస్థ.
దశాబ్దాలుగా స్టాక్ మానిప్యులేన్ , ఖాతాల మోసాలకు పాల్పడిందంటూ సంచలన ప్రకటన చేసింది. కాగా సదరు సంస్థ చేసిన ఆరోపణలు అవాస్తవమంటూ ఆరోపించింది అదానీ గ్రూప్. ఎఫ్పిఓ ముందు పరువు తీసేందుకు పన్నిన కుట్రగా అభివర్ణించింది.
ఇదిలా ఉండగా ఇవాళ అదానీ గ్రూప్ రూ. 20,000 కోట్ల ఎఫ్పీఓ ఇవాల్టి నుంచి ప్రారంభం కానుంది. ఇక హిడెన్ బర్గ్ రీసెర్స్ సంస్థ ఇప్పటి దాకా అనేక కంపెనీల లావాదేవీలను, అవి చేసే అక్రమాలను, లొసుగులను బయట పెట్టింది.
ఇది ఈక్విటీ, క్రెడట్ , డెరివేటివ్ లను విశ్లేషించే ఫోరెన్సిక్ ఆర్థిక పరిశోధన సంస్థ. మే 6, 1937న జరిగన హిండెన్ బర్గ్ ఎయిర్ షిప్ క్రాస్ తర్వాత కంపెనీ పేరు పెట్టాడు ఆండర్సన్.
ఇక హిండెన్ బర్గ్ రీసెర్స్ సంస్థ ఆయా కంపెనీలపై రీసెర్చ్ చేసి ప్రచురిస్తుంది. ఇక నాథన్ ఆండర్సన్(Nathan Anderson) కనెక్టికట్ విశ్వ విద్యాలయం నుండి ఇంటర్నేషనల్ బిజినెస్ లో చదివాడు.
ఫాక్ట్ సెట్ రీసెర్చ్ సంస్థలో పని చేశాడు. విచిత్రం ఏమిటంటే నాథన్ ఆండర్సన్ ఇజ్రాయెల్ లో అంబులెన్స్ డ్రైవర్ గా పని చేశాడు.
హ్యారీ మార్కో పోలోను తన రోల్ మోడల్ గా పేర్కొంటాడు. 36 కంపెనీల్లో జరుగుతున్న మోసాలను బయట పెట్టాడు నాథన్ అండర్సన్.
ప్రస్తుతం అదానీ గ్రూప్ కోర్టుకు ఎక్కుతానంటోంది. ఏది ఏమైనా నాథన్ కొట్టిన దెబ్బకు అదానీ గ్రూప్ అబ్బా అంటోంది.
Also Read : హిండెన్‌బర్గ్ పై అదానీ గ్రూప్ దావా