Pralhad Joshi : బతికి ఉండగానే సమాధి కడతారా
జేపీ నడ్డా వ్యవహారంపై ప్రహ్లాద్ జోషి
Pralhad Joshi : రాష్ట్రంలో రాజకీయాలు మరింత వేడెక్కాయి. టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ మధ్య మాటల యుద్దం నడుస్తోంది. చివరకు పాలిటిక్స్ సమాధుల వద్దకు చేరాయి. విచిత్రం ఏమిటంటే భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు సమాధి కట్టారు.
తాను గతంలో ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీని నెరవేర్చడంలో విఫలమం అయ్యారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఏకంగా సమాధి తొవ్వి దాని పక్కన జేపీ నడ్డా ఫోటో పెట్టారు. దీంతో ఈ వ్యవహారం చిలికి చిలికి గాలివానగా మారింది.
రాజకీయాలలో విమర్శలు సహజమే కానీ ఇలాంటి చిల్లర రాజకీయాలకు , దిగజారుడు పనులు చేస్తారా అంటూ నిప్పులు చెరిగారు బీజేపీ నాయకులు. దీనిపై సీరియస్ గా స్పందించింది బీజేపీ. దీని వెనుక అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ పనేనంటూ ఆరోపించింది.
ఇదే సమయంలో జేపీ నడ్డాకు సమాధి కట్టడంపై సీరియస్ గా రియాక్ట్ అయ్యారు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి(Pralhad Joshi) . దీనిని తీవ్రంగా ఖండించారు. ఇది మంచి పద్దతి కాదని సూచించారు.
విచిత్రం ఏమిటంటే గుజరాత్ లో సామూహిక అత్యాచారానికి పాల్పడిన 11 మంది నిందితులను విడుదల చేయడం సబబే అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ఈ కేంద్ర మంత్రి.
ఆయన చేసిన వ్యాఖ్యలపై దేశ వ్యాప్తంగా మహిళలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఒక బాధ్యత కలిగిన మంత్రి ఇలాంటి చవకబారు కామెంట్స్ చేయడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు.
జోషికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు జార్ఖండ్ సీఎం హేమంత్ సోరేన్ . ఇంకా రేప్ లు చేసేందుకు విడుదల చేశారా అంటూ నిలదీశారు.
Also Read : మోదీ లిజ్ ట్రస్ ను చూసి నేర్చుకో – కేటీఆర్