Wishes to Team India: టీమిండియాకు చంద్రబాబు, పవన్, జగన్ ల శుభాకాంక్షలు !

టీమిండియాకు చంద్రబాబు, పవన్, జగన్ ల శుభాకాంక్షలు !

Wishes to Team India: బార్బడోస్ వేదికగా దక్షిణ ఆఫ్రికా, భారత్ మధ్య జరిగిన టీ20 ప్రపంచకప్ ఫైనల్ లో విజయం సాధించి విశ్వ విజేతగా నిలిచిన భారత జట్టుకు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Pawan Kalyan), మంత్రి నారా లోకేష్, వైసీపీ అధినేత వైఎస్ జగన్ తమ సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలిపారు.

భారత క్రికెట్ టీం చరిత్ర సృష్టించిందని, భారత జట్టుకు, సపోర్టింగ్ స్టాఫ్‌ కు ఆయన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. 11 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తరువాత టి20 వరల్డ్ కప్పు భారత్ సాధించిందని, ఈ విజయం భారత ప్రజలను సంతోషం, ఆనందాన్ని పంచిందని ఏపీ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

Wishes to Team India – విశ్వ విజేతలకు డిప్యూటీ సీఎం పవన్ అభినందనలు !

టీ20 ప్రపంచకప్ గెలుచుకుని విశ్వ విజేతగా నిలచిన భారత జట్టుకు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్(Pawan Kalyan) అభినందనలు తెలిపారు. 140 కోట్ల భారతీయుల ఆకాంక్షలను నిలబెడుతూ రోహిత్ సేన సాధించిన విజయం చరిత్రలో నిలచిపోతుందన్నారు. దక్షిణాఫ్రికాతో జరిగిన తుది పోరులో జట్టు మొత్తం సమిష్టిగా రాణించిన తీరు అద్భుతమని కొనియాడారు. ఆధ్యంతం ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్‌ లో ఒత్తిడిని జయంచి సగర్వంగా ప్రపంచకప్ సాధించి పెట్టిన భారత క్రికెటర్లకు శుభాకాంక్షలు తెలిపారు. ‘మీ విజయం భవిష్యత్ తరాలకు స్ఫూర్తి దాయకం.. ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ క్రికెట్‌‌లో భారత్ మరిన్ని విజయాలు అందుకోవాలని ఆకాంక్షిస్తున్నాను’ అంటూ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు.

Wishes to Team India – రోహిత్ సేన చరిత్ర సృష్టించింది – మంత్రి లోకేష్

భారత క్రికెట్ జట్టు ఈరోజు ఒక అద్భుతమైన విజయాన్ని సాధించిందని మంత్రి నారా లోకేష్(Nara Lokesh) తన సోషల్ మీడియా ఎక్స్‌లో పేర్కొన్నారు. రోహిత్ సేన చరిత్ర సృష్టించిందని, తీవ్రమైన ఒత్తిడిలో కూడా సూర్య కుమార్ యాదవ్ పట్టిన క్యాచ్ మ్యాచ్‌ను గెలిపించిందన్నారు. దేశం మొత్తం మిమ్మల్ని చూసి గర్విస్తోందని మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు.

సమిష్టి కృష్టితో భారత్ విజయం – వైసీపీ అధినేత జగన్

టీ20 వరల్డ్ కప్ విజేత భారత జట్టుకు వైయస్ఆర్ సీపీ అధినేత జగన్మోన్ రెడ్డి తన సోషల్ మీడియా ఎక్స్ వేదికగా అభినందనలు తెలిపారు. టోర్నీ ఆద్యంతం సమిష్టి కృష్టితో భారత జట్టు విజయాలు సాధించిందని, కృషి, పట్టుదలతో మరో గొప్పగెలుపు సొంతంచేసుకున్నారని ప్రశంసించారు. వన్డే వరల్డ్‌ కప్‌ ఫైనల్‌ లో ఇండియా టీం ఓటమితో తీవ్ర నిరాశకు గురైన అభిమానులకు ఈ విజయం గొప్ప ఊరట ఇచ్చిందన్నారు. బీసీసీఐ కెప్టెన్‌ గా తెలుగువాడు కావడం గర్వకారాణమన్నారు. జట్టును విజయవంతంగా నడిపించడంలో రోహిత్‌ చక్కటి నాయకత్వాన్ని ప్రదర్శించారని, రానున్న రోజుల్లో టీం ఇండియా మరిన్ని ఛాంపియన్‌షిప్‌లు సాధిస్తుందని ఆకాంక్షిస్తున్నానని జగన్ పేర్కొన్నారు.

కాగా ఉత్కంఠభరితంగా ముగిసిన టీ20 వరల్డ్‌క్‌ప ఫైనల్లో భారత్‌ చాంపియన్‌గా నిలిచింది. శనివారం దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్లో రోహిత్‌ సేన 7 పరుగుల తేడాతో గెలిచింది. మొదటిసారి ఐసీసీ టోర్నీలో ఫైనల్‌కు చేరిన దక్షిణాఫ్రికా విజయం అంచులవరకు వచ్చినా చివర్లో మ్యాచ్‌ను చేజార్చుకుంది. ముందుగా బ్యాటింగ్‌ కు దిగిన భారత్‌ 20 ఓవర్లలో 7 వికెట్లకు 176 పరుగులు చేసింది. విరాట్‌ కోహ్లీ (59 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 76), అక్షర్‌ పటేల్‌ (31 బంతుల్లో 1 ఫోర్‌, 4 సిక్సర్లతో 47), శివమ్‌ దూబే (16 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌తో 27) రాణించారు. కేశవ్‌, నోకియాలకు రెండేసి వికెట్లు దక్కాయి.

ఆ తర్వాత ఛేదనలో దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 8 వికెట్లకు 169 పరుగులు చేసి ఓడింది. క్లాసెన్‌ (27 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్సర్లతో 52), స్టబ్స్‌ (31), డికాక్‌ (39), మిల్లర్‌ (21) రాణించారు. హార్దిక్‌కు మూడు.. బుమ్రా, అర్ష్‌దీప్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా విరాట్‌, ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌గా బుమ్రా నిలిచారు.

Also Read : Telangana Bhavan: ‘స్టార్‌’ హోటల్‌కు తెలంగాణ భవన్‌ బాధ్యతలు ?

Leave A Reply

Your Email Id will not be published!