Quadruplets: మూడో కాన్పులో నలుగురికి జన్మనిచ్చిన మహిళ
మూడో కాన్పులో నలుగురికి జన్మనిచ్చిన మహిళ
Quadruplets : మహారాష్ట్రలోని సాతారా జిల్లాలో ఓ మహిళ ఒకే కాన్పులో నలుగురు బిడ్డలకు జన్మనిచ్చింది. అయితే, ఇది ఆమెకు మూడో కాన్సు కావడం విశేషం. తొలి సంతానంలో ఇద్దరు కవలలు (ఓ బాలుడు, బాలిక) ఉండగా… రెండో కాన్పులో ఓ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తాజాగా నలుగురిలో ముగ్గురు అమ్మాయిలు, ఒకరు అబ్బాయి అని వైద్యులు వెల్లడించారు. వారి బరువు 1200గ్రాముల నుంచి 1600 గ్రాములుగా ఉందన్నారు. తక్కువ బరువు కారణంగా ప్రస్తుతం వారిని ఎన్‌ఐసీయూలో ఉంచినట్లు తెలిపారు.
Quadruplets in Maharashtra
పూణె జిల్లా సస్వాద్‌కు చెందిన మహిళ ఉద్యోగరీత్యా కోరెగావ్‌లో నివసిస్తోంది. రెండు రోజుల క్రితం సాతారా జిల్లా ఆసుపత్రిలో చేరింది. పరీక్షలు నిర్వహించిన వైద్యులు… ఆరోగ్య తీవ్రత దృష్ట్యా సిజేరియన్ చేయాలని నిర్ణయించి తక్షణమే పూర్తిచేశారు. ఆపరేషన్ విజయవంతం అయ్యిందని, ఆమె కోలుకుంటోందని వైద్యులు వెల్లడించారు. అయితే, గతంలో ఒకేకాన్పులో నలుగురికి జన్మనిచ్చిన ఘటనలు ఉన్నప్పటికీ… సాతారా జిల్లా ఆసుపత్రిలో మాత్రం ఇదే తొలిసారి అని వైద్యులు తెలిపారు.
Also Read : Minister Kondapalli Srinivas: గ్లోబల్ సమ్మిట్‌లో ప్రపంచ దేశాలను ఆకట్టుకున్నాం – మంత్రి కొండపల్లి
