Woman: ప్రియుడి కోసం భర్త, అత్త, మామలపై విష ప్రయోగం చేసిన మహిళ
ప్రియుడి కోసం భర్త, అత్త, మామలపై విష ప్రయోగం చేసిన మహిళ
Woman : వివాహేతర సంబంధాలు నిండు కుటుంబాలను నిట్ట నిలువునా చీల్చేస్తున్నాయి. ప్రియుడు లేదా ప్రియురాలి మోజులో కట్టుకున్నవారిని, కన్నవారిని, మెట్టినింటి వారు అని లెక్క చేయకుండా కడతేరుస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రియుడి మోజులో ఉన్న వివాహిత తన భర్త కుటుంబాన్ని అంతం చేయాలని వేసిన పన్నాగం బెడిసి కొట్టింది. భర్త అప్రమత్తం కావడంతో ఆకుటుంబం బతికి బట్ట కట్టింది. ఆమె ఇప్పుడు కటకటాల పాలయ్యింది. ఈఘటన కర్ణాటక(Karnataka)లోని హాసన్ జిల్లా బేలూరు తాలూకా కెరళూరు గ్రామంలో చోటుచేసుకుంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే…
Woman Plans
కెరళూరు గ్రామానికి చెందిన గజేంద్ర అనే వ్యక్తికి 11 ఏళ్ల క్రితం చైత్ర అనే యువతితో వివాహమైంది. ఈ దంపతులకు ఇద్దరు మగపిల్లలు ఉన్నారు. అత్తమామలతో కలిసి జీవిస్తున్నారు. కొన్నేళ్ళ క్రితం చైత్ర పునీత్ అనే యువకుడితో చైత్ర సన్నిహితంగా ఉండేది. ఈ విషయం గజేంద్రకు, అత్తమామకు తెలిసింది. పెద్దలు పంచాయితీ చేసి రాజీ కుదిర్చారు. కొన్ని రోజులు దంపతులు అన్యోన్యంగా ఉన్నారు. అయితే చైత్ర మరోసారి శివ అనే మరో యువకుడితో అక్రమ సంబంధం ఏర్పరుచుకుంది. ఈ నేపథ్యంలో ప్రియుడు శివ కోసం… భర్త, అత్తమామలను అడ్డు తొలగించుకోవాలని భావించింది. దీనికోసం వారు తినే ఆహారంలో విషం కలిపింది. అయితే చైత్ర ప్రవర్తనలో తేడా గమనించిన భర్త ప్రమాదాన్ని పసిగట్టాడు. అన్నంలో విషం కలిపినట్లు తెలుసుకొని బేలూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనితో రంగంలోనికి దిగన పోలీసులు… విషాహారాన్ని పరిశీలించి చైత్రను అరెస్టు చేసారు. ఆమెపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Also Read : Earthquake: ఢిల్లీలో స్వల్ప భూకంపం
