Wrestlers Protest : డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ బెదిరింపులు – సాక్షి మాలిక్
డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ పై సంచలన ఆరోపణలు
Wrestlers Protest : డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ , బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పై మరోసారి తీవ్ర కామెంట్స్ చేశారు మహిళా రెజ్లర్(Wrestlers) సాక్షి మాలిక్. ఆయనపై ఢిల్లీ పోలీసులు ఇప్పటికే రెండు కేసులు నమోదు చేశారు. ఒకటి మహిళా రెజ్లర్లది కాగా మరొకటి మైనర్ బాలిక తండ్రి. కాగా నివేదిక సమర్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతో విచారణను వేగవంతం చేసింది ఢిల్లీ పోలీస్. ఇప్పటికే సునీతా ఫోగట్ ను మహిళా కానిస్టేబుళ్లతో కలిసి బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ నివాసానికి వెళ్లారు. అక్కడ ఎలా లైంగిక, మానసిక, శారీరక వేధింపులకు గురయ్యారనే దానిపై విచారణ చేపట్టారు.
ఇదే కేసుకు సంబంధించి ట్విస్ట్ చోటు చేసుకుంది. మైనర్ బాలిక తండ్రి తన కూతురు మైనర్ కాదని తెలియక చెప్పానని , ప్రస్తుతం ఆమె మేజర్ అని కోర్టుకు తెలిపారు. దీంతో కేసును తప్పుదోవ పట్టించేందుకు కేంద్రం ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు మహిళా రెజ్లర్ సాక్షి మాలిక్. శనివారం ఆమె జాతీయ మీడియాతో మాట్లాడారు.
మరోసారి నిప్పులు చెరిగారు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పై. విచారణను నిర్వీర్యం చసేంత శక్తి , ప్రభావం నిందితుడికి ఉందని ముందు ఆయనను అరెస్ట్ చేయాలని తాము డిమాండ్ చేశామని చెప్పారు. కానీ కేంద్రం ఒప్పు కోలేదన్నారు. అసలు పోలీసులు వ్యవహరిస్తున్న తీరు దారుణంగా ఉందన్నారు. ఫిర్యాదుదారులను తన వద్దకు పిలిపించుకుని బెదిరిస్తున్నాడంటూ ఆరోపించారు.
Also Read : Ram Charan Upasana : కొత్త జంటకు చెర్రీ..ఉపాసన విషెస్