T20 World Cup India : టీ20 వరల్డ్ కప్ లో టీమిండియా
హర్మన్ ప్రీత్ కౌర్ కెప్టెన్
T20 World Cup India : దక్షిణాఫ్రికా వేదికగా ఐసీసీ మహిళా టీ20 వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. ఇపుడు జరుగుతోంది ఎనిమిదో ఎడిషన్. మొత్తం 10 జట్లు పాల్గొంటున్నాయి. భారత జట్టు బి గ్రూప్ లో కొనసాగుతోంది. కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చిన వరల్డ్ కప్ ను ఐసీసీ ఈసారి 2023లో దక్షిణాఫ్రికా వేదికగా ప్రపంచ కప్ పొట్టి ఫార్మాట్ లో నిర్వహిస్తోంది. భారత జట్టుకు ఈ వరల్డ్ కప్ అందని ద్రాక్షగా మిగిలింది.
అన్ని విభాగాలలో టీమిండియా మహిళల జట్టు బలంగా కనిపిస్తోంది. ప్రధానంగా స్టార్ హిట్టర్ వైస్ కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ రాణిస్తే మిడిల్ ఆర్డర్ లో గనుక నిలకడగా ఆడితే భారత జట్టుకు(T20 World Cup India) ఢోకా అన్నది ఉండదని క్రికెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఇక బౌలింగ్ , బ్యాటింగ్ ఫార్మాట్ లో బలంగా ఉంది. కానీ ఒక్క ఫీల్డింగ్ విషయంలో మాత్రం మరి కొంత తప్పులు దిద్దు కోవాల్సిన అవసరం ఉందని అనిపిస్తోంది. ఇక మంధాన, షెఫాలీ వర్మ , రిచా ముందుగా రాణిస్తే గనుక పరుగుల వరద పారించ వచ్చు.
ఇక భారత మహిళా జట్టు విషయానికి వస్తే హర్మన్ ప్రీత్ కౌర్ కెప్టెన్ కాగా స్మృతీ మంధాన వైస్ కెప్టెన్ . ఇక జట్టులో శిఖా పాండే, సబ్భినేని మేఘన, స్నేహ రాణా, మేఘనా సింగ్, యాస్తికా భాటియా, రిచా ఘోష్, జెమీమా రోడ్రిగ్స్, హర్లీన్ డియోల్, దీప్తి శర్మ, దేవిక వైద్య, రాధా యాదవ్, రేణుకా ఠాకూర్, పూజా ఠాకూర్, పూజా ఠాకూర్, అంజలి వస్త్రాకర్ ఆడనున్నారు.
Also Read : జోరు మీదున్న పాకిస్తాన్