Amaravati: రాజధాని అమరావతిలో వరల్డ్‌ బ్యాంక్‌, ఏడీబీ ప్రతినిధి బృందం పర్యటన

రాజధాని అమరావతిలో వరల్డ్‌ బ్యాంక్‌, ఏడీబీ ప్రతినిధి బృందం పర్యటన

Amaravati : ఏపీ రాజధాని అమరావతి పనులు తిరిగి ప్రారంభమైన వేళ… ప్రపంచబ్యాంక్‌, ఆసియా అభివృద్ధి బ్యాంక్‌ ప్రతినిధి బృందాలు ఆ ప్రాంతంలో పర్యటించాయి. సీఆర్‌డీఏ అదనపు కమిషనర్‌ జి.సూర్యసాయి ప్రవీణ్ చంద్… వారిని రాజధానిలోని వివిధ ప్రాంతాలకు తీసుకెళ్లారు. ప్రపంచబ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు ప్రతినిధుల్లో సీనియర్ ఎన్విరాన్‌మెంటల్ స్పెషలిస్ట్ జోసెఫ్, పర్యావరణ సంరక్షణ కార్యకలాపాల సలహాదారు దమన్‌జిత్ సింగ్ మిన్హాస్‌ ఉన్నారు.

World Bank in Amaravati

అమరావతి (Amaravati) ప్రాంతంలో నిర్మాణ పనులు జరుగుతున్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నివాస సముదాయాలు, శాఖమూరు రిజర్వాయర్, ఎల్పీఎస్ జోన్ 2ఎ ప్రాజెక్టు సైట్, కార్మికుల క్యాంపులను ప్రపంచబ్యాంక్‌, ఏడీబీ బృంద సభ్యులు, సీఆర్‌డీఏ, అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్(ADCL) అధికారులు, సిబ్బంది పరిశీలించారు. ప్రపంచబ్యాంక్‌, ఏడీబీ బృంద సభ్యులు.. ఆయా సైట్లలో పనిచేస్తున్న కార్మికులతో మాట్లాడారు. గుత్తేదారు సంస్థలు క్యాంప్‌లలో అందుబాటులో ఉంచిన మౌలిక సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. రాజధాని అమరావతి నిర్మాణంలో పాలుపంచుకుంటున్న గుత్తేదారులతో మాట్లాడారు. నిర్మాణ ప్రాంతాల్లో పర్యావరణ పరిరక్షణ, సామాజిక రక్షణ, ఏవైనా అవాంఛనీయ ఘటనలు జరిగినప్పుడు పాటించాల్సిన సురక్షిత విధానాలు, కార్మికుల భద్రత గురించి వివరించారు.

Also Read : SP Amit Bardar: మావోల ఎన్‌ కౌంటర్ పై కీలక విషయాలు వెల్లడించిన ఎస్పీ అమిత్ బర్దార్

Leave A Reply

Your Email Id will not be published!