S Jai Shankar : ప్రపంచం చూపు మోదీ వైపు – జై శంకర్
అన్ని రంగాలలో భారత్ ముంందజ
S Jai Shankar : విదేశాంగ శాఖ మంత్రి సుబ్రమణ్యం జై శంకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత దేశాన్ని అన్ని రంగాలలో అభివృద్ది పథంలో తీసుకు పోయేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రయత్నం చేస్తున్నారంటూ స్పష్టం చేశారు కేంద్ర మంత్రి.
కర్ణాటకలోని బెంగళూరులో థింకర్స్ ఫోరమ్ ఏర్పాటు చేసిన సమావేశంలో సుబ్రమణ్యం జై శంకర్(S Jai Shankar) ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఫోరమ్ కు, సిటీ నివాసితులకు ధన్యవాదాలు తెలిపారు. యావత్ ప్రపంచం భారత దేశం వైపు చూస్తోందన్నారు.
మోదీ ప్రభుత్వం దేశాన్ని మార్చిందని, ఇది యావత్ ప్రపంచాన్ని ఆకట్టుకునేలా చేసిందన్నారు కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి. వరల్డ్ ఎక్కడా లేని రీతిలో ప్రపంచంలో ఏకైక ప్రజాస్వామ్యం కలిగిన ప్రభుత్వంగా దేశం ఉందన్నారు.
డిజిటల్ టెక్నాలజీలో భారత్ టాప్ లో కొనసాగుతోందన్నారు. గతంలో పాలకులు దేశాన్ని భ్రష్టు పట్టించారని కానీ తాము పవర్ లోకి వచ్చాక టాప్ లో ఉందంటూ పేర్కొన్నారు సుబ్రమణ్యం జై శంకర్. టెక్నాలజీ పరంగా భారత్ తన ప్రాధాన్యతను కనబరుస్తోందని, యావత్ మార్కెట్ లో భారత్ తీవ్ర ప్రభావాన్ని చూపుతోందన్నారు.
యావత్ భారతం ఇప్పుడు మోదీ(PM Modi) జపం చేస్తోందని చెప్పారు . ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు.
Also Read : ది కేరళ స్టోరీ వసూళ్ల సునామీ