Wrong Gopal Varma : రాంగ్ గోపాల్ వ‌ర్మ సినిమా రివ్యూ

Wrong Gopal Varma movie review

Wrong Gopal Varma: ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ వ్యవహార శైలి పై వ‌స్తున్న విమర్శనాస్త్రాల ప్రేర‌ణ‌తో ప‌లు సినిమాలు రూపొందుతున్నాయి. ఈ క్ర‌మంలోనే సీనియర్ సినీ జర్నలిస్టు ప్రభు దర్శకత్వ, నిర్మాణ సార‌ధ్యంలో ఆర్జీవిని ఉద్దేశించి పరోక్షంగా సంధించిన విమర్శనాస్త్రమే రాంగ్ గోపాల్ వర్మ‌.

Wrong Gopal Varma Lyrics in Telugu, Wrong Gopal Varma (From "Wrong Gopal  Varma") Wrong Gopal Varma Song Lyrics in English Free Online on Gaana.com

చిత్ర‌ కథ..

అయితే గ‌తంలో భార‌తీయ చ‌ల‌న చిత్ర సీమ‌లో అనేక సూప‌ర్ హిట్ చిత్రాలని నిర్మించి స‌రికొత్త ట్రెండ్ సృష్టించుకున్న‌ ప్రముఖ దర్శకుడు రాజ్ గోపాల్ వర్మ (షకలక శంకర్) . స్పూర్తితో ద‌ర్శ‌కుడు కావాల‌ని చాలా మంది ఆత‌ని శిష్య‌రికం చేసేందుకు ఉత్సాహం చూపుతారు. ఈ క్ర‌మంలోనే కత్తి మహేష్ కూడా ఆత‌ని శిష్యుడిగా చేరుతాడు. కానీ ప్ర‌స్తుతం అంతా నా ఇష్టం, నాసినిమాలు న‌చ్చిన‌తేనే చూడండ‌న్న అహంకార ధోర‌ణితో మాట్లాడటంతో పాటు ప్ర‌ముఖుల వ్య‌క్తిగ‌త‌ జీవితాల‌లో వేలుపెట్టి, స‌మాజంలో జ‌రుగుతున్న చెడు వ్య‌వ‌హారాల‌ను త‌న‌కు అనుకూలంగా మార్చుకుని చిత్రాలు తీయ‌టంపై ప‌లువురు జ‌ర్న‌లిస్టులు మాట‌ల సంద‌ర్భంలో పుట్టిన పాట యూట్యూబ్‌లో వైర‌ల్ అవుతుంది. ఈ ప్రతికూల కథనాన్ని కత్తి మహేష్ త‌న‌ మొబైల్‌లో చూస్తున్న‌ప్పుడు అక్క‌డ‌కి వ‌చ్చిన రాజ్ గోపాల్ వర్మ త‌క్ష‌ణం త‌న ఇంటి నుంచి వెళ్లిపోమ‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తాడు. క‌త్తి మ‌హేష్ బై‌ట‌కు వెళ్తూ.. ఇజాల‌, ప్రిజాల‌కు ఓ వ్య‌క్తి లొంగిపోలే ప్రేక్ష‌కుల మ‌న‌సుల నుండి గెటౌట్ కావాల్సిందేనంటూ తేల్చి చెప్ప్తాడు. త‌పై సంధించిన విమ‌ర్శ‌నాస్త్రాన్ని చూస్తూ, ర‌గిలిపోతున్న రాజ్‌గోపాల్ వ‌ర్మ‌కు ఆత‌నిలోని అంతరాత్మ ఆయ‌న చేస్తున్న త‌ప్పుల‌ను ఎత్తి చూపుతుంది. మ‌రి రాజ్ గోపాల్ వర్మకు ఎలాంటి గుణపాఠాన్ని చెప్పింది. అంత‌రాత్మ‌లా వ‌చ్చిందెవ‌రు? వ‌ర్మ‌లో మార్పుని కోరుకుని నిర్దేశించిన ల‌క్ష్యం ఏమిటి? ఇలా అనేక‌ ప్రశ్నలకు సమాధానమే ఈ చిత్ర కథ.

 

ఎలా ఉందంటే…

నిజ జీవితంలోనూ సూటిగా సుత్తి లేకుండా మాట్లాడి, త‌ను అనుకున్న‌ది నేరుగా చెప్ప‌గ‌ల స‌మ‌ర్దుడు జర్నలిస్టు ప్రభు త‌క్కువ పాత్ర‌ల‌తోనే త‌ను చెప్పాల్సింది స్ప‌ష్టంగా చెప్పార‌నిపిస్తుంది. సినిమా చూస్తున్నంత సేపూ మ‌నం వర్మకు సంబంధించి ఇప్ప‌టికే విన్న‌ విషయాలే చెపుతున్న‌ట్టు క‌నిపించినా వ్యక్తిగత దూషణకు తావు లేని సంభాష‌ణ‌ల‌తో సినిమాను రూపొందించడంలోస‌క్స‌స్ అయ్యారనిపిస్తుంది. క‌త్తి మ‌హేష్ ఎంట్రీతో ఆరంభ‌మైన చిత్రంలో వ‌ర్మ ఇంటి గోడ‌ల‌పై ఉన్న చిత్రాల‌పై అడిగిన ప్ర‌శ్న‌ల‌కు వ‌ర్మ జ‌వాబులు ఆశ్చ‌ర్యం క‌లిగించేలా తీర్చిదిద్దారు. ఆడ‌వారిపై వ‌ర్మ‌కున్న అభిప్రాయాల‌ను ఎండ‌గ‌ట్టేలా అభితో సాగిన స‌న్నివేశాలు మ‌న‌కు చూపిస్తాయి.

ఎన్నో హిట్‌ల‌తో సంద‌డి చేసిన వ‌ర్మ ఒక‌ప్పుడు ఆత‌ని సినిమాలు మాట్లాడేవి… ఇప్పుడు ఆయ‌నే ఛాన‌ళ్ల వెంటబ‌డి మాట్లాడుకోవాల్సి వ‌స్తోంది ఇది స్ధాయిని దిగ‌జార్చుకోవ‌ట‌మేన‌నే వాస్త‌వ కోణం క‌నిపించింది. మియా మాల్కోవా తో సినిమా స‌న్నివేశాలు చిత్రీక‌ర‌ణ స‌మ‌యంలో త‌న త‌ల్లి కూడా ప‌క్క‌నే ఉంద‌ని గ‌తంలో చెప్పిన వ‌ర్మ‌కు చెంప‌పెట్టులా ఆమె ఆ స‌మ‌యంలో గోరు ముద్ద‌లు తినిపించిందా? అని నిల‌దీయ‌టం. బ్లూఫిలిం కొడుకు తీస్తుంటే వారించ‌ని ఆ త‌ల్లికి శ‌త‌కోటి వంద‌నాలంటూ చెప్ప‌డం వ‌ర్మ స్ధానం ఎంత ప‌డిపోయింద‌న‌టానికి నిద‌ర్శ‌న‌మే. అంతే కాదు అ న్నం పెట్టే ఇండ‌స్ట్రీని త‌ల‌దించుకునేలా చేస్తున్న‌వారికి మ‌ద్ద‌తుగా నిల‌వటంపైనా, ఎన్టీ ఆర్‌ని అవ‌మానించిన తీరుపై, సంధించిన వ్యంగ్యాస్త్రాలు బాగున్నాయి. ఇండ‌స్ట్రీలో అన్ని విభాగాల‌లో ప్ర‌తిభాపాట‌వాలు చూపుకున్న వ‌ర్మ‌, ఇత‌రుల జీవితాల‌ను కెల‌క‌డం మానేసి భార‌తావ‌నికి ఆస్కార్ అందించే దిశ‌గా దృష్టి సారించాల‌ని, నువ్వు 2024లో ఆస్కార్ సాధించి చూపించాలంటూ ప్ర‌భు విస‌రిన‌ స‌వాల్ కొస‌మెరుపు

 

నటీనటులు

వ‌ర్మ‌గా అనేక స్టేజ్ షోల‌లో, జ‌బ‌ర్దస్త్ కామెడీ షోల‌లో అల‌రించిన‌ షకలక శంకర్ మరోసారి తనకు నచ్చిన పాత్రలో ప‌ర‌కాయ ప్ర‌వేశం చెసి అల‌రించాడు. అభి పాత్ర నిడివి చాలా తక్కువ‌, కత్తి మహేష్ సినిమాకి బ‌ల‌మే. వ‌ర్మ గెట్ ఔట్ అన్న‌ప్పుడు చెప్పిన‌డైలాగులు గుర్తుండిపోతాయి. చివరగా ద‌ర్శ‌కుడు ప్ర‌భు గెస్ట్ అప్పీయరెన్స్‌గా క‌నిపించి మెరిసారు. అలాగే సినిమాలో జ‌ర్న‌లిస్టుల‌కు కూడా ప్ర‌భు అవ‌కాశం క‌ల్పించ‌డం విశేషం అని చెప్పాలి.

 

సాంకేతిక విభాగాలు

జర్నలిస్టు గా అనేక క‌థ‌నాలు రాసిన ప్రభు ఈ సినిమాకు రాసిన‌ మాటలు చాలా చోట్ల తూటాల్లా పేలాయి. ఛాయాగ్రాహకుడు బాబు త‌న కెమెరా ప‌నిత‌నం చూపాడు. సంగీత దర్శకుడు షకీల్ రూపొందించి టైటిల్ సాంగ్ బాగుంది. అలాగే స‌న్నివేశాల‌కు త‌గ్గ‌ట్టు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది.

ప్ల‌స్‌లు
ష‌క‌ల‌క శంక‌ర్ న‌ట‌న‌
ప్ర‌భు డైలాగులు
బాబు ఫోటోగ్ర‌ఫీ,
సంగీతం

మైన‌స్‌లు
పాత్ర‌లు ప‌రిమితం కావ‌టం

 

చివ‌రిగా

వ‌ర్మ అంత‌రాత్మ చెప్పిన అంశాల‌ను మ‌రికొన్ని పాత్ర‌లు జోడించి చెపితే బాగుండేది. ప్ర‌ధానంగా వ‌ర్మ కార‌ణంగా ఇబ్బందులు ప‌డిన మ‌హిళ‌ల‌ని నేరుగా పాత్ర‌ల‌ను చేసి ఉంటే బాగుండేది. టీవీ షోల‌లో రెచ్చిపోయిన తీరు, మాట్లాడే విధానం తెర‌కెక్కించి ఉంటే ముందేం జ‌రిగింద‌న్న విష‌యంపై మ‌రికొంత స్ప‌ష్ట‌త వ‌చ్చేది.

– రామ్‌గోపాల్‌, హైద‌రాబాద్‌

 

No comment allowed please