Y Plus Security MLA’s : రెబల్ ఎమ్మెల్యేలకు వై ప్లస్ భద్రత
మహారాష్ట్రలో పెద్ద ఎత్తున కార్యకర్తల ఫైర్
Y Plus Security MLA’s : మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం ఇంకా కొనసాగుతూనే ఉంది. శివసేన పార్టీకి చెందిన మంత్రి ఏక్ నాథ్ ముండే నేతృత్వంలో పలువురు ఎమ్మెల్యేలు అస్సాంలోని గౌహతి రాడిసన్ బ్లూ హోటల్ లో మకాం వేశారు.
అంతుకు ముందు వారు గుజరాత్ లోని సూరత్ లో ఆశ్రయం పొందారు. అక్కడి నుంచి ఇక్కడికి మార్చారు. రోజుకు రూ. 8 లక్షల రూపాయలతో వారం రోజులకు బుక్ చేసుకున్నారు.
తాజాగా అందిన సమాచారం మేరకు మరో రెండు రోజులు పొడిగించినట్లు టాక్. ఈ హోటల్ నుంచే ఏక్ నాథ్ షిండే రాజకీయం నడుపుతున్నారు.
ఇదే సమయంలో మహారాష్ట్ర డిప్యూటీ స్పీకర్ అనర్హత వేటు వేస్తూ నోటీసులు పంపించారు. ఇది చెల్లదంటున్నారు ఏక్ నాథ్ షిండే. ఇదే సమయంలో శివసేన పార్టీకి చెందిన కార్యకర్తలు రోడ్లపైకి వచ్చారు.
ధిక్కార స్వరం మినిపించిన ఎమ్మెల్యేల ఇళ్లు, ఆఫీసులను టార్గెట్ చేశారు. దాడులకు పాల్పడుతుండడంతో పరిస్థితి విషమించకుండా ముంబై సిటీ పోలీస్ కమిషనర్ 144వ సెక్షన్ విధిస్తున్నట్లు ప్రకటించారు.
అయినా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ సమయంలో ఎట్టి పరిస్థితుల్లో తమ బలం నిరూపించు కోవాలంటే రెబల్స్ తప్పనిసరిగా ముంబైకి రావాల్సిందే.
అయితే వస్తే వారు ఎలా తట్టుకోగలరనేది ప్రశ్నార్థకంగా మారంది. వాళ్ల ప్రాణాలకు ముప్పు ఉందనే కారణంతో కేంద్ర హోం శాఖ మొత్తం 15 మంది శివసేన రెబల్ ఎమ్మెల్యేలకు వై ప్లస్ కేటగిరి భద్రత(Y Plus Security MLA’s) కల్పిస్తున్నట్లు తెలిపింది.
నాలుగు నుంచి ఐదుగురు సీఆర్పీఎఫ్ కమాండలు షిఫ్టుల వారీగా ఉంటారు. ఇదక భద్రత కల్పించిన వారిలో రమేష్ బోర్నారే, మంగేష్ కుడాల్కర్ , సంజయ్ శిర్సత్ , లతా బాయి సోనా వానే, ప్రకాశ్ సర్వేతో పాటు మరో 10 మంది ఉన్నారు.
Also Read : ఉద్దవ్ ఠాక్రేకు అండగా భార్య రష్మీ ఠాక్రే