Yaddanapudi Sulochana Rani: నవలా రాజ్యంలో రాణి

వలా రాజ్యంలో రాణి 'యద్దనపూడి సులోచనారాణి'

యద్దనపూడి సులోచనారాణి

Yaddanapudi : యద్దనపూడి సులోచనారాణి (2April 1940 – 18 May 2018): నవలా రాజ్యంలో రాణిగా గుర్తింపు పొందిన యద్దనపూడి సులోచనారాణి ప్రముఖ తెలుగు రచయిత్రి. కృష్ణా జిల్లా మొవ్వ మండలంలోని కాజాలో జన్మించిన సులోచనారాణి తాను పరిశీంచిన జీవితాలను కథా వస్తువులుగా తీసుకొని రచనలు చేశారు. ఆలుమగల మధ్య ప్రేమలు, మారుతున్న ప్రజల జీవిన విధానాలకు అనుగుణంగా కుటుంబాల్లో వచ్చిన మార్పులను ఆధారంగా ఆమె రచించిన కథలు పలు సినిమాలుగానే కాక టీవి సీరియల్స్ గా మలచబడ్డాయి.

Yaddanapudi – నవలా రచయితగా సులోచనారాణి

సాహిత్యాన్ని పాఠకులకు అత్యంత చేరువగా తీసుకెళ్ళిన సాహితీ దిగ్గజం యద్దనపూడి సులోచనారాణి(Yaddanapudi). సులోచనారాణి నవలల్లో ఆమె చుట్టూ ఉన్న సాధారణ మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి కుటుంబాల జీవితాలుంటాయి. వాటిలో మట్టిలో మాణిక్యాల్లా నాయికా నాయకులు స్వంత వ్యక్తిత్వంతో ప్రకాశించే విధంగా పాత్రలు ఉంటాయి. ఈ ప్రపంచంలో ఆనందంగా ఉండేందుకు కొంత స్నేహం, కొంత అవగాహన, కొంత ప్రేమ, కొంత గౌరవం ఉంటే చాలని నిరూపించే విధంగా సులోచనారాణి నవలో పాత్రలు ఉంటాయి.

పాఠకాదరణ పొందిన యద్దనపూడి నవలలు

సులోచనారాణి రచించిన నవలల్లో ఆగమనం, ఆరాధన, ఆత్మీయులు, అభిజాత, అభిశాపం, అగ్నిపూలు, ఆహుతి, అమర హృదయం, అమృతధార, అనురాగ గంగ, అనురాగ తోరణం, అర్థస్థిత, ఆశల శిఖరాలు, అవ్యక్తం, బహుమతి, బందీ, బంగారు కలలు, చీకట్లో చిరుదీపం, దాంపత్యవనం, హృదయగానం, జాహ్నవి, జలపాతం, జీవన సత్యాలు, జీవన సౌరభం, జీవన తరంగాలు, జీవనగీతం, జ్యోతి, కలల కౌగిలి, కీర్తి కిరీటాలు, కృష్ణలోహిత, మధురస్వప్నం, మనోభిరామం, మౌనభాష్యం, మౌన తరంగాలు, మీనా, మోహిత, మౌనపోరాటం, నీరాజనం, నిశాంత, ఒంటరి నక్షత్రం, పార్థు, ప్రేమదీపిక, ప్రేమలేఖలు, ప్రేమపీఠం, ప్రేమ సింహాసనం, ప్రియసఖి, రాధాకృష్ణ, రుతువులు నవ్వాయి, సహజీవనం, సంసార రథం, సౌగంధి, సెక్రటరీ, సీతాపతి, స్నేహమయి, సుకుమారి, శ్వేత గులాబీలు ముఖ్యమైనవి.

సినిమాలుగా యుద్ధనపూడి నవలలు

మీనా, జీవన తరంగాలు, సెక్రటరీ, రాధాకృష్ణ, అగ్నిపూలు, చండీప్రియ, ప్రేమలేఖలు, బంగారు కలలు, విచిత్రబంధం, జై జవాన్, ఆత్మ గౌరవం

డైలీ సీరియల్ గా యుద్ధనపూడి నవల “గిరిజా కళ్యాణం”

యద్దనపూడి సులోచనారాణి వ్రాసిన “గిరిజా కళ్యాణం” నవల మూల ఆధారంగా 2006 నుండి 2008 వరకు 450 భాగాలుగా మా టీవిలో రాధ మధు డైలీ సీరియల్ ప్రసారమయ్యింది.

కాలిఫోర్నియాలో మృతి చెందిన సులోచనారాణి

యుద్ధనపూడి సులోచనారాణి కాలిఫోర్నియాలోని కుపర్టినోలో 2018, మే 18న గుండెపోటుతో మృతిచెందారు.

Also Read : BJP Announce : బీజేపీ స్టార్ క్యాంపెయిన‌ర్ల ఎంపిక

Leave A Reply

Your Email Id will not be published!