Yanamala Rama Krishnudu: అనర్హత వేటు నిబంధనలపై జగన్ పై యనమల సెటైర్లు
అనర్హత వేటు నిబంధనలపై జగన్ పై యనమల సెటైర్లు
Yanamala Rama Krishnudu : అనర్హత వేటు నిబంధన ఏంటని మాజీ సీఎం జగన్ అడగడం హాస్యాస్పదమని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు (Yanamala Rama Krishnudu) అన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 188, 190(4) చదివితే ఈ అంశం అర్థమవుతుందని తెలిపారు. ఆ నిబంధనలు అర్థం చేసుకుంటే జగన్‌కు సందేహాలు రావని పేర్కొన్నారు. అవి అర్థం కాకుంటే న్యాయవాదులను అడిగి తెలుసుకోవాలని సూచించారు. ఎమ్మెల్యేలు వరుసగా 60 రోజులు సభకు రాకపోతే అనర్హత వేటు వేయొచ్చన్నారు. అంతే కాకుండా… తదుపరి ఎన్నికల్లోనూ పోటీ చేయవచ్చా అనేది కోర్టులో తేలాల్సి ఉందని చెప్పారు. ఎమ్మెల్యేగా ప్రమాణం చేసి అసెంబ్లీని బహిష్కరిస్తామనడం అనర్హత పరిధిలోకే వస్తుందని వివరించారు.
Yanamala Rama Krishnudu – విధ్వంసకర రాజకీయాలు మానుకోవాలి – జగన్ కు దేవినేని హితవు
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan) పై మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ 11 సీట్లకు పరిమితమైనా జగన్ మైండ్ సెట్, ఆ పార్టీ ఆలోచనా విధానంలో ఏమాత్రం మార్పు లేదని విమర్శించారు. ఐదేళ్లలో పూర్తి కావాల్సిన పోలవరం ప్రాజెక్టు పనులను మూడు శాతమే చేసి ఇంకా సిగ్గు లేకుండా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, అంబటి రాంబాబు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. ఆదివారం విజయవాడలో దేవినేని ఉమా మహేశ్వరరావు మీడియాతో మాట్లాడారు.
పోలవరం ఫేజ్-1, ఫేజ్-2 లేవని చెప్పారని.. కానీ మీడియా సమావేశంలో ఫేజ్‌ల వారీగా విడదీశామని బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వాస్తవాలు ఒప్పుకున్నారని చెప్పుకొచ్చారు. బుగ్గనకు సిగ్గుంటే తన జిల్లాలోని ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం సందర్శించాలని.. అది ఎక్కడుందో కూడా ఆయనకు తెలీదని ఎద్దేవా చేశారు. పోలవరం ప్రాజెక్టును రెండు ఫేజ్‌లుగా విడదీశామని జగన్ ప్రజల ముందుకొచ్చి చెంపలేసుకోవాలని హితవు పలికారు. పదవి పోయిందని ఏడుస్తావా?.. బుద్ధి జ్ఞానం ఉందా? అంటూ దేవినేని ఉమా ఫైర్ అయ్యారు.
‘దేనికయ్యా జగన్ నీకు అధికారం ఏపీని నాశనం చేయడానికా..?’ అని ప్రశ్నించారు. ‘అంబటి రాంబాబు.. ఎందుకు నోరు పారేసుకుంటావ్’ అని హెచ్చరించారు. ఐదేళ్లు ఇరిగేషన్ రంగాన్ని వైసీపీ సర్వనాశనం చేసిందని ధ్వజమెత్తారు. జగన్ ప్రభుత్వంలో వ్యవసాయ రంగం పూర్తిగా దెబ్బతిందని విమర్శించారు. విధ్వంసకర రాజకీయాలు మానేసి జగన్ రెడ్డి వైసీపీ దుకాణం సర్దుకుంటే మంచిదని దేవినేని ఉమా మహేశ్వరరావు హితవు పలికారు.
Also Read : CM Revanth Reddy : స్థానిక పోరుకు తెలంగాణా ప్రభుత్వం సిద్ధం ?
