Yandamuri Awards : ‘సరస్వతి విద్యాపీఠం’ పురస్కారాలు
నలుగురు వర్ధమాన రచయితలు ఎంపిక
Yandamuri Awards : తెలుగు సాహిత్యంలో పేరొందిన రచయిత యుండమూరి వీరంద్రేనాథ్. నవలా రచయితగా, వ్యక్తిత్వ వికాస నిపుణుడిగా, విశ్లేషకుడిగా ఇప్పటికే ఎంతో గుర్తింపు పొందారు. ఆయన నేటికీ రాస్తూనే ఉన్నారు. యుండమూరి వీరేంద్ర నాథ్ స్వయంగా సరస్వతీ విద్యాపీఠంను నెలకొల్పారు. అక్కడ నేటి సమాజానికి కావాల్సిన వాటిని నేర్పుతున్నారు. విద్య ప్రాధాన్యత, జీవితానికి ఉన్న విలువ ఏమిటో చెబుతున్నారు. ఇప్పటికే పలుచోట్ల తన ప్రసంగాలతో యువతకు దిశా నిర్దేశం చేస్తున్నారు.
ఇంపాక్ట్ ద్వారా లక్షలాదికి ప్రేరణగా నిలిచారు యుండమూరి వీరేంద్రనాథ్. తాజాగా ఆయన సంచలన ప్రకటన చేశారు. వర్ధమాన రచయితల్ని ప్రోత్సహించే ఉద్దేశంతో సరస్వతి విద్యా పీఠం తరపున సరస్వతి బంగారు పతకాలు(Yandamuri Awards) అందజేయాలని నిర్ణయించారు.
ఈ మేరకు ఈ ఏడాది 2023కి సంబంధించి నలుగురు రచయితలను ఎంపిక చేశారు. ప్రసిద్ద సాహితీ సంస్థ వంశీ ఆర్ట్ థియేటర్స్ సహకారంతో మార్చి 23న ఉగాది పండుగ పర్వదినం పురస్కరించుకుని హైదరాబాద్ లోని త్యాగరాయ గాన సభలో వీరికి అందజేయనున్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా రచయిత యుండమూరి వీరేంద్ర నాథ్ తెలిపారు.
దుబాయిల్ 350వ అంతస్తు కిటికీ అద్దాలు తుడిచే వలస కూలీ శివ కథ రాసిన శ్రీ ఊహ (ఇసుక అద్దం), రైల్వే స్టేషన్ కి అరిటాకులో ఇడ్లి, కాఫీ తీసుకొచ్చిన మిత్రుడి కథ రాసిన ఉమా మహేష్ (సంఘే శక్తి కలియుగే) ను ఈ పురస్కారానికి ఎంపిక చేశారు. స్నేహితుడి కోసం ప్రాణాలిచ్చిన సూరి గాడి కథ నల్లకోడి రాసిన సురేంద్ర శీలం (పార్వేట) , అబార్జన్ చేయించి పెళ్లి చేసుకున్న బుచ్చిబాబు కథ సీత కనపడింది రాసిన నాగేంద్ర కాశి (నల్ల వంతెన) ని ఎంపిక చేశారు.
Also Read : తిరుమలలో సరికొత్త ప్రయోగం