Yashaswini Reddy MLA : ఎన్నారైల సేవలు ప్రశంసనీయం
పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి
Yashaswini Reddy MLA : హైదరాబాద్ – కాంగ్రెస్ పార్టీ పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన ఎన్నారైలు ఎంతో మంది ఇతర దేశాలలో ఉన్నారని అన్నారు. వారందరూ తమ తమ ఊర్లను దత్తత తీసుకునేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
Yashaswini Reddy MLA Comment
అమెరికా తెలుగు అసోసియేషన్ (ఆటా) ఆధ్వర్యంలో హైదరాబాద్ లో సేవా కార్యక్రమాల గ్రాండ్ పినాలేలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేశారు. సంపాదించిన దానిలో ఇక్కడి నుంచి చదువు కునేందుకు వెళ్లే విద్యార్థులను ఆదుకోవాలని సూచించారు.
అంతే కాకుండా విద్యార్థులతో పాటు బతుకు దెరువు కోసం వెళ్లే వారికి ఉపయోగకరంగా ఉండేలా కౌన్సిలింగ్ సెంటర్లను ఏర్పాటు చేయాలని అన్నారు మామిడాల యశస్విని రెడ్డి(Yashaswini Reddy). సంపాదించిన దాంట్లో కొంత మొత్తాన్ని, సమయాన్ని సామాజిక అభివృద్దికి తోడ్పాటు అందించాలని కోరారు.
తాము ఇప్పటికే ఎన్నో సేవా కార్యక్రమాలను చేపట్టడం జరిగిందని చెప్పారు. ఉన్న ఊరును, పెంచిన వారిని, చదువు చెప్పి మార్గం చూపించిన వారిని ఎన్నడూ మరిచి పోవద్దని తెలిపారు ఎమ్మెల్యే. జీవితంలో ఎదగాలంటే విద్య ఒక్కటేనేనని, దాని ద్వారానే మనకు గుర్తింపు లభిస్తుందన్నారు.
Also Read : HCA President : ఉప్పల్ స్టేడియం ఆధునీకరణ