Jagadish Shettar : యెడ్డీ విమర్శలు నాకు ఆశీస్సులు – షెట్టర్
మాజీ సీఎం షాకింగ్ కామెంట్స్
Jagadish Shettar : మాజీ సీఎంల మధ్య మాటల యుద్దం కొనసాగుతంది కర్ణాటకలో. భారతీయ జనతా పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యెడ్యూరప్ప నిప్పులు చెరిగారు.
ఇటీవలే బీజేపీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ సీఎం జగదీశ్ షెట్టర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. షెట్టర్ ఎన్నికల్లో ఓడి పోవడం ఖాయమని జోష్యం చెప్పారు యెడ్యూరప్ప. దీనిపై సీరియస్ గా స్పందించారు మాజీ సీఎం జగదీశ్ షెట్టర్(Jagadish Shettar) .
యెడ్డీ అంటే తనకు గౌరవం ఉందని, ఆయనపై తనకు ఎలాంటి కోపం లేదన్నారు. పనిలో పనిగా తాను ఓడిపోతానని చెప్పడం వల్ల తనకు ఒరిగే నష్టం ఏమీ ఉండదన్నారు జగదీశ్ షెట్టర్. మాజీ సీఎం చేసిన విమర్శలను తాను ఆశీర్వాదంగా తీసుకుంటున్నట్లు చెప్పారు. ఇప్పటికే తాను ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందానని, తాజాగా ఏడోసారి కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నానని స్పష్టం చేశారు జగదీశ్ షెట్టర్(Jagadish Shettar) .
బీజేపీ నాయకుడి కోరికలు తనకు విజయంగా మారుతాయని భావిస్తున్నట్లు చెప్పారు. అమిత్ షా ఇక్కడికి వచ్చారు. నాపై దాడి చేశారు. బీజేపీకి చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరారు. కానీ బీజేపీ పూర్తిగా మిగతా వారిని పక్కన పెట్టింది.
కేవలం తనను మాత్రమే లక్ష్యంగా చేసుకుని విమర్శలు, ఆరోపణలు చేస్తూ వచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. నేను ఓడి పోవాలనే యెడ్యూరప్ప కోరిక విజయంగా మారుతుందన్నారు జగదీశ్ షెట్టర్. బీజేపీని వెన్ను పోటు పొడిచిన షెట్టర్ ఓడి పోవడం ఖాయమని పేర్కొన్నారు మాజీ సీఎం యెడ్డీ.
Also Read : రాహుల్ అభ్యర్థన కోర్టు తిరస్కరణ