Yennam Srinivas Reddy Jitta : హస్తం గూటికి జిట్టా..యెన్నం
రేవంత్ రెడ్డితో నేతల భేటీ
Yennam Srinivas Reddy Jitta : హైదరాబాద్ – భారతీయ జనతా పార్టీకి గుడ్ బై చెప్పిన జిట్టా బాలకృష్ణా రెడ్డి, యెన్నం శ్రీనివాస్ రెడ్డిలు మర్యాద పూర్వకంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని కలుసుకున్నారు. వారిద్దరూ తెలంగాణ ఉద్యమంలో కీలకమైన పాత్ర పోషించారు. గతంలో యెన్నం శ్రీనివాస్ రెడ్డి మహబూబ్ నగర్ నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు.
Yennam Srinivas Reddy Jitta Joins BJP
అంతకు ముందు ఆయన కస్టమ్స్ ఆఫీసర్ గా పని చేశారు. తెలంగాణ ఉద్యమం సందర్బంగా తన ఉన్నత పదవికి రాజీనామా చేశారు. సీఎం కేసీఆర్ కు అనుంగు అనుచరుడిగా గుర్తింపు పొందారు. ఆ తర్వాత ఆయన నిర్ణయాలు నచ్చక బయటకు వచ్చారు. బీజేపీలో చేరి ఎమ్మెల్యేగా గెలుపొందారు.
ప్రస్తుతం బీజేపీ అనుసరిస్తున్న విధానాలు నచ్చక పార్టీకి దూరంగా ఉన్నారు. ఆ మధ్యన కీలక వ్యాఖ్యలు చేశారు. దీంతో పార్టీ నుండి సస్పెండ్ కు గురయ్యారు. ఇక జిట్టా బాలకృష్ణా రెడ్డి(Yennam Srinivas Reddy) తెలంగాణ ఉద్యమ నేతగా గుర్తింపు పొందారు. కీలకమైన నాయకుడిగా ఎదిగారు. ప్రతి పోరాటంలోనూ ముందంజలో ఉన్నారు.
ఆయనతో పాటు యెన్నం శ్రీనివాస్ రెడ్డి బయటకు వచ్చారు. వీరిద్దరూ ఈనెల 17న తుక్కుగూడలో జరిగే కాంగ్రెస్ బహిరంగ సభలో సోనియా గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఈ మేరకు రేవంత్ రెడ్డి లైన్ క్లియర్ కూడా ఇచ్చినట్టు సమాచారం.
Also Read : AP ACB Court Slams : బాబు లాయర్లపై ఏసీబీ కోర్టు ఫైర్