Yepuri Somanna : కారెక్కిన ఏపూరి సోమన్న
వైఎస్సార్ తెలంగాణ పార్టీకి దెబ్బ
Yepuri Somanna : హైదరాబాద్ – తెలంగాణ ఉద్యమకారుడు, పాటలతో ప్రజలను చైతన్యవంతం చేస్తూ వచ్చిన ప్రజా గాయకుడిగా గుర్తింపు పొందిన ఏపూరి సోమన్న షర్మిలకు(YS Sharmila) షాక్ ఇచ్చారు. వైఎస్సార్ తెలంగాణ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఉన్నట్టుండి ఆయన భారత రాష్ట్ర సమితి పార్టీలో చేరారు.
Yepuri Somanna Joined in BRS Party
పార్టీలోకి కండువా కప్పి ఆహ్వానించారు మాజీ స్పీకర్ మధుసూదనాచారి. గతంలో ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. ఎవని పాలైందరో తెలంగాణ అన్న పాటతో మరింత పాపులర్ అయ్యారు. అధికారంలో ఉన్న టీఆర్ఎస్ (బీఆర్ఎస్ ) పార్టీ పై, సీఎం కేసీఆర్ పై, కల్వకుంట్ల కుటుంబపై ఎన్నో పాటలు పాడారు.
ఉద్యమ కాలంలో తన గొంతుతో ప్రజలను చైతన్యవంతం చేశారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. తన పాటలతో ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. అధికార పార్టీని ఎండగట్టారు. నానా విమర్శలు గుప్పించారు. అనరాని మాటలు అన్నారు.
ఆ తర్వాత ఉన్నట్టుండి వైఎస్ షర్మిల స్థాపించిన పార్టీలో కీలక భూమిక పోషించారు. తాజాగా బీఆర్ఎస్ లో చేరడం విస్తు పోయేలా చేసింది. ప్రజల కోసం పాడాల్సిన గొంతుక ఇప్పుడు దొర పాలన గడీలలోకి చేరిందంటూ అభిమానులు మండిపడుతున్నారు.
Also Read : Komatireddy Venkat Reddy : కోమటిరెడ్డి కీలక కామెంట్స్