Shashi Tharoor : గెల‌వాలంటే పోరాటం చేయాలి – శ‌శి థ‌రూర్

నెలాఖ‌రు త‌ర్వాత ఎవ‌రు ఏమిట‌నేది తేలుతుంది

Shashi Tharoor : కాంగ్రెస్ పార్టీలో అధ్యక్ష ప‌ద‌వికి సంబంధించి ఎన్నిక‌ల కోలాహ‌లం నెల‌కొంది. ఎవ‌రు గెలుస్తార‌నే దానిపై ఉత్కంఠ నెల‌కొంది. ఇప్ప‌టికే నామినేష‌న్ల స్వీక‌ర‌ణ ప్రారంభ‌మైంది. అధ్య‌క్ష బ‌రిలో చివ‌ర‌కు ఇద్ద‌రు మాత్ర‌మే మిగులుతార‌ని ప్ర‌చారం జోరందుకుంది.

ఒక‌రు గాంధీ ఫ్యామిలీ త‌ర‌పున రాజ‌స్తాన్ సీఎం అశోక్ గెహ్లాట్ నాన్ గాంధీ ఫ్యామిలీ త‌ర‌పున తిరువ‌నంత‌పురం ఎంపీ శ‌శి థ‌రూర్(Shashi Tharoor) బ‌రిలో ఉండ‌నున్నారు. మొత్తంగా ఈ ఎన్నిక‌ల ఎపిసోడ్ కాంగ్రెస్ పార్టీలో ఎవ‌రు ఏమిట‌నే దానిపై క్లారిటీ వ‌చ్చేలా చేసింది.

ప్ర‌స్తుతం ఒక‌రికి ఒకే ప‌ద‌వి ఉండాల‌ని రాహుల్ గాంధీ స్ప‌ష్టం చేశారు ఇప్ప‌టికే. దీంతో అశోక్ గెహ్లాట్ ప‌రిస్థితి రెంటికి చెడ్డ రేవ‌డి అన్న చందంగా మారింది. ఒక‌వేళ పార్టీ చీఫ్ గా ఎన్నికైతే త‌ను ముఖ్య‌మంత్రిగా ఉన్న రాజ‌స్తాన్ సీఎం ప‌ద‌విని వ‌దులు కోవాల్సిన ప‌రిస్థితి నెల‌కొంది.

ఇప్ప‌టికే రాజ‌స్థాన్ లో రాజ‌కీయ సంక్షోభం నెల‌కొంది. పార్టీ హైక‌మాండ్ ప్ర‌స్తుత ప‌రిస్థితిపై ఆరా తీస్తోంది. 91 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు జెండా ఎగుర‌వేశారు.

తాము స‌చిన్ పైల‌ట్ ను సీఎంగా ఒప్పుకునే ప్ర‌స‌క్తి లేద‌ని స్ప‌ష్టం చేశారు. ఈ త‌రుణంలో శ‌శి థ‌రూర్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. నామినేష‌న్ వేసేందుకు ఫారాలు తీసుకున్నా. నెలాఖ‌రు త‌ర్వాత ఎవ‌రు ఉంటారనేది తేలుతుంద‌న్నారు శ‌శి థ‌రూర్(Shashi Tharoor).

అయితే గెల‌వాలంటే చాలా పోరాటం చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌ని స్ప‌ష్టం చేశారు. ప్ర‌స్తుతం తిరువ‌నంత పురం ఎంపీ చేసిన వ్యాఖ్య‌లు పార్టీలో తీవ్ర చ‌ర్చ‌కు దారితీశాయి.

Also Read : స‌త్యేంద‌ర్ జైన్ కేసు విచార‌ణ

Leave A Reply

Your Email Id will not be published!