Youth Congress: ఉప్పల్ స్టేడియంను ముట్టడించిన యూత్ కాంగ్రెస్ నాయకులు

ఉప్పల్ స్టేడియంను ముట్టడించిన యూత్ కాంగ్రెస్ నాయకులు

Youth Congress : హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్, సన్ రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం మధ్య వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. పాసులు, ఫ్రీ టికెట్లు అంటూ హెచ్‌సీఏ తమను వేధిస్తోందంటూ ఎస్ఆర్‌హెచ్‌ ఆరోపణలు చేస్తోంది. ఈ వివాదంపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)… హెచ్‌సీఏ విజిలెన్స్ విచారణకు ఆదేశించారు. ఆదేశాలు వచ్చిన వెంటనే రంగంలోకి దిగిన విజిలెన్స్ అధికారులు ఉప్పల్ స్టేడియంలో విచారణ ప్రారంభించారు. ఎస్‌ఆర్‌హెచ్, హెచ్‌సీఏ మధ్య జరిగిన ఈమెయిల్స్‌ని చెక్ చేస్తున్నారు.

Youth Congress Leaders

అయితే హెచ్‌సీఏ వైఖరిని నిరసిస్తూ… తెలంగాణా యూత్ కాంగ్రెస్(Youth Congress) ఆధ్వర్యంలో ఉప్పల్ స్టేడియం ఎదుట ఆందోళన చేపట్టారు. హెచ్‌సీఏ చైర్మన్ జగన్ మోహన్ రావు డౌన్ డౌన్ అంటు నినాదాలు చేశారు. అవినీతికి పాల్పడిన జగన్ మోహన్ రావు పై న్యాయ విచారణ చేయాలని డిమాండ్ చేశారు. హరీష్ రావు బినామీ ఐన జగన్ మోహన్ రావు ఐపీల్ టికెట్స్ బ్లాక్ చేస్తున్నాడని మండిపడ్డారు. ఇవి సరిపోక ఇంకా టికెట్స్ కావాలి అని SRH పై ఒత్తిడి చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా ఒత్తిడి చేసి SRH వేరే రాష్టానికి తరలిపోవాలని చూస్తున్నాడని మండిపడ్డారు. ఇదంతా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బద్నామ్ చేయడానికే జగన్ మోహన్ రావు ఇలాంటి ప్రయత్నం చేస్తున్నాడని అన్నారు. స్టేడియం దగ్గర హెచ్‌సిఏ అధ్యక్షుడు జగన్ మోహన్ రావు దిష్టి బొమ్మను యూత్ కాంగ్రెస్ నాయకులు దగ్థం చేశారు. పోలీసులు వారిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.

మరోవైపు విజిలెన్స్ అధికారులు… ఐపీఎల్‌కు ముందు అపెక్స్ కౌన్సిల్ మీటింగ్‌లో తీసుకున్న నిర్ణయాలపైనా విచారిస్తున్నారు. ఇప్పటికే గత రెండు సంవత్సరాలుగా హెచ్‌సీఏ చేపట్టిన రెనువేషన్స్ వాటికి సంబంధించిన లెక్కలు పరిశీలిస్తున్నారు. ఎస్‌ఆర్‌హెచ్, హెచ్‌సీఏ మధ్య ఐపీఎల్‌కు ముందు జరిగిన ఒప్పందాలకు సంబంధించిన రికార్డ్స్‌ను పరిశీలిస్తున్నారు. విజిలెన్స్ డీజీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి ఉప్పల్ స్టేడియం‌కు వచ్చి… రికార్డులు పరిశీలిస్తున్నారు. మరోవైపు హెచ్సీఏ ప్రెసిడెంట్ జగన్ మోహన్ రావుకు విజిలెన్స్ అధికారుల రేపు విచారణకు రావాలంటూ సమాచారం ఇచ్చారు.

ఎస్ఆర్‌హెచ్ ఫ్రాంచైజీ ఉప్పల్ స్టేడియాన్ని హోం గ్రౌండ్‌గా చేసుకుని ఐపీఎల్ ఆడుతున్న విషయం తెలిసిందే. ఇన్నాళ్లు బాగానే ఉన్నా… రెండేళ్ల క్రితం నుంచే తమకు వేధింపులు మొదలయ్యాయని సన్‌రైజర్స్ మేనేజ్‌మెంట్‌ ఆరోపణలు చేస్తోంది. ఈ ఒత్తిళ్లను తట్టుకోలేక సన్‌రైజర్ యాజమాన్యం ఇతర రాష్ట్రాలకు వెళ్తే… ప్రభుత్వం బ్లేమ్ అవుతుందని విషయం గ్రహించిన రేవంత్ రెడ్డి వెంటనే విజిలెన్స్ విచారణకు ఆదేశించారు.

Also Read : CM Revanth Reddy: ఎల్‌ఆర్‌ఎస్‌ రాయితీ గడువును పొడిగించిన రేవంత్ సర్కార్

Leave A Reply

Your Email Id will not be published!