YouTuber: ఉడుము కూర వండిన యూట్యూబర్ అరెస్ట్

ఉడుము కూర వండిన యూట్యూబర్ అరెస్ట్

YouTuber : ఏం చేసైనా సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వాలి.పెట్టిన పోస్టుకు లైక్స్ లక్షల్లో రావాలి. వీడియోకు మిలియన్ల వ్యూస్ రావాలి అనే వారి సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతుంది. ఈ అత్యుత్సాహంతో, చట్టం, నైతికత, సమాజం పట్ల బాధ్యతను విస్మరించి విస్మరించి ప్రవర్తిస్తున్నారు. ఈ నేపథ్యంలో లైక్స్, షేర్స్, వ్యూస్ కోసం వారు చేస్తున్న అత్యుత్సాహం… కొన్నిసార్లు వికటించి వారిని జైలు పాలు చేస్తుంది. తాజాగా ఇలా ప్రవర్తించిన ఓ యూట్యూబర్‌ జైలు పాలయ్యాడు. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే…

YouTuber Arrest

సాంస్కృతికంగా, చారిత్రికంగా, ప్రకృతి సోయగాలతో అలరారుతున్న ఒడిశా రాష్ట్రానికి చెందిన రూప్‌ నాయక్‌ అనే యూట్యూబర్‌ (Youtuber) ఓ వీడియో కారణంగా జైలు పాలయ్యాడు. మయూర్భంజ్ జిల్లాకు చెందిన రూప్ నాయక్ తన అత్తింటి నుండి తిరిగి వస్తున్నాడు. మార్గం మధ్యలో అతడికి రోడ్డు పక్కన మానిటర్ లిజర్డ్ (ఉడుము) దొరికింది. దానిని ఇంటికి తీసుకెళ్లి, మాంసం వండాడు. అంతేకాదు, ఉడుము మాంసం కూర ఎలా వండాలి? ఎలాంటి దినుసులు వేయాలో మొత్తం సవివరంగా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అంతే, ఈ వీడియో ఒక్కసారిగా వైరలైంది. వైరలైన వీడియో గురించి అటవీ శాఖకు సమాచారం అందింది.

ఇంకేం జంతు సంరక్షణ యాక్ట్‌ 1972 కింద అటవీ శాఖ అధికారులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. విచారణలో తాను చేసిన తప్పు ఒప్పుకున్నాడు. ప్రస్తుతం అతడికి కోర్టు రిమాండ్‌ విధించింది. కాగా, అటవీ జంతువులను వేటాడటం, చంపడం, లేదా తినడం చట్టపరంగా తీవ్రమైన నేరం. దీనికి జైలు శిక్ష, జరిమానా సైతం చెల్లించాల్సి ఉంటుంది. తస్మాత్‌ జాగ్రత్త.

Also Read : Supreme Court: వీధి కుక్కలపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు

Leave A Reply

Your Email Id will not be published!