YS Jagan : వరద బాధితులకు జగన్ ఆసరా రూ.2 వేలు సాయం

48 గంటల్లో అందాలని ఆదేశం

YS Jagan : ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (Ys Jagan) గోదావరి వరదలపై సమీక్ష నిర్వహించారు. సచివాలయంలో 6 జిల్లాల కలెక్టర్లు, అధికారులతో చర్చించారు. గోదావరికి వరద (Godavari Floods) నీరు క్రమంగా తగ్గుముఖం పడుతోందని.. సహాయ కార్యక్రమాలను ముమ్మరం చేయాల్సి ఉంది అన్నారు.

 సీనియర్‌ అధికారులు, కలెక్టర్లపై ఈ బాధ్యత ఉందని.. వచ్చే 48 గంటల్లో ఏ ఇల్లు మిగిలిపోకుండా రూ.2వేల రూపాయల సహాయం అందాలని సూచించారు. 

అలాగే 25 కేజీల బియ్యం, కేజీ కందిపప్పు, కేజీ బంగాళాదుంపలు, కేజీ ఉల్లిపాయలు, కేజీ పామాయిల్‌‌లను అందించాలన్నారు. వరద బాధిత కుటుంబాలకు వచ్చే 48 గంటల్లో అందాలని ఆదేశించారు.

ప్రతి సచివాలయంలో 10 మంది ఉద్యోగులు ఉన్నారని.. ప్రతి 50 ఇళ్లకూ ఒక వాలంటీర్‌ ఉన్నారన్నారు. ఇలాంటి వ్యవస్థ అందుబాటులో ఉంది కాబట్టి.. నాణ్యమైన సేవలు అందించాలి అన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పంపిణీని ముమ్మరం చేయాలన్నారు సీఎం. ఇంత వ్యవస్థతో ఎప్పుడూ జరగని విధంగా సహాయ కార్యక్రమాలు చేస్తున్నామని.. గతంలో ఎప్పుడూ కూడా రూ.2వేల ఆర్థిక సహాయం చేయలేదన్నారు. 

విరామం లేకుండా అవిశ్రాంతంగా పనిచేస్తున్నామని.. ఇంకా మీకు ఏమైనా కావాలన్నా.. మీకు అన్నిరకాలుగా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామన్నారు.

నిధుల సమస్య లేనే లేదని.. ప్రోయాక్టివ్‌గా ముందుకు వెళ్లాలన్నారు. ఎలాంటి సమస్య ఉన్నా.. పరిష్కరించడానికి ఫోన్‌కాల్‌ చేస్తే చాలన్నారు. వచ్చే 48 గంటల్లో వరద బాధిత కటుంబాలకు రేషన్, రూ.2వేల రూపాయలు అందాలని.. బాధిత కుటుంబాలకు మానవతా దృక్పథంతో వ్యవహరించాలన్నారు. 

ఇప్పటివరకూ ఒక్కరు మాత్రమే మరణించినట్టుగా సమాచారం ఉందన్నారు. బాధిత కుటుంబానికి వెంటనే పరిహారం అందించండి.. ఎక్కడ అవసరం ఉంటే.. అక్కడ శిబిరాలు కొనసాగించాని సూచించారు.

Also Read : ఆగ‌స్టు 13 నుంచి ఏపీలో జెండా పండుగ‌

Leave A Reply

Your Email Id will not be published!