YS Jagan: ప్రతిపక్ష హోదాపై హైకోర్టులో జగన్ పిటిషన్ ! స్పీకర్‌‌ కార్యదర్శికి నోటీసులు !

ప్రతిపక్ష హోదాపై హైకోర్టులో జగన్ పిటిషన్ ! స్పీకర్‌‌ కార్యదర్శికి నోటీసులు !

YS Jagan: ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 11 స్థానాలకే పరిమితం అయినప్పటికీ … తన పార్టీకు ప్రతిపక్ష హోదా కల్పించాలని వైఎస్సార్‌సీపీ అధినేత, ఆ పార్టీ శాసన సభాపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పిటిషన్‌ పై ఏపీ హైకోర్టు మంగళవారం విచారణ జరిపింది. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానానికి… కక్షపూరితంగా ప్రతిపక్ష నేత హోదా ఇవ్వటం లేదని వైఎస్‌ జగన్‌(YS Jagan) తరఫున న్యాయవాది తన వాదనను వినిపించారు. ప్రతిపక్ష నేతగా గుర్తించాలని స్పీకర్‌కు వైఎస్ జగన్ రిప్రజెంటేషన్‌ ఇచ్చారా అని న్యాయమూర్తి ప్రశ్నించగా, గత నెల 24న ఇచ్చారని కోర్టుకు వైఎస్‌ జగన్‌ తరఫున న్యాయవాది తెలిపారు. ఈ మేరకు ఆ పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. జగన్ దాఖలు చేసిన పిటిషన్‌కు వెంటనే కౌంటర్ దాఖలు చేయాలని అసెంబ్లీ కార్యదర్శికి, స్పీకర్ అయ్యన్న పాత్రుడికి కోర్టు నోటీసులు జారీ చేసింది. అదేవిధంగా రూల్ పొజిషన్ వివరాలను తమ ముందు పెట్టాలని హైకోర్టు ధర్మాసనం పేర్కొంది. పిటిషన్‌పై తదుపరి విచారణను మరో మూడు వారాలకు వాయిదా వేశారు.

YS Jagan Case..

కాగా, అసెంబ్లీలో వైసీపీ ప్రతిపక్ష హోదా ఇవ్వాలని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్‌ జగన్‌ మంగళవారం రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడుకి లేఖ రాశారు. ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం సందర్భంగా ముఖ్యమంత్రి తరువాత ప్రతిపక్ష నేతతో ప్రమాణస్వీకారం చేయించడం ఆనవాయితీ అని లేఖలో పేర్కొన్నారు. సంప్రదాయాలకు తుంగలో తొక్కుతూ మంత్రుల తరువాత ప్రతిపక్ష నాయకుడితో ప్రమాణం చేయించడం సరైంది కాదని జగన్ పేర్కొన్నారు. ప్రతిపక్ష నాయకుడిగా గుర్తింపు ఇవ్వొద్దని ముందే నిర్ణయించారా అని లేఖ ద్వారా ప్రశ్నించారు. విపక్షంలో ఎవరికి ఎక్కువ సీట్లు ఉంటే వాళ్లకే ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలని చట్టంలో ఉందని జగన్ తెలిపారు. అయితే జగన్ రాసిన లేఖపై స్పీకర్ నుండి స్పందన రాకపోవడంతో… తన పార్టీకు ప్రతిపక్ష పార్టీ హోదా కల్పించాలని కోరుతూ హై కోర్టులో పిటీషన్ దాఖలు చేసారు.

Also Read : Pawan Kalyan: అటవీ శాఖ ఉద్యోగులపై దాడి ఘటనపై డిప్యూటీ సీఎం పవన్‌ ఆగ్రహం !

Leave A Reply

Your Email Id will not be published!