YS Jagan: సింగయ్య మృతి కేసులో జగన్ కు బిగ్ రిలీఫ్
సింగయ్య మృతి కేసులో జగన్ కు బిగ్ రిలీఫ్
YS Jagan : సింగయ్య మృతి కేసులో వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ (YS Jagan) కు హైకోర్టులో తాత్కాలిక ఊరట లభించింది. ఈ కేసులో రెండు వారాల వరకూ తదనంతర చర్యలు తీసుకోవద్దని పోలీసులకు న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసును కొట్టివేయాలంటూ జగన్ దాఖలు చేసిన పిటిషన్ పై మంగళవారం హైకోర్టులో విచారణకు వచ్చింది. తమ వద్ద ఉన్న వీడియో ఆధారాలు, ఇతర సాక్ష్యాలు కోర్ట్ ముందు ఉంచేందుకు రెండు వారాలు సమయం కావాలని కోర్టును అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ కోరారు. అయితే ఇప్పటికే ఈ కేసును బీఎన్‌ఎస్ కింద 105 సెక్షన్‌కు మార్చారని పిటిషనర్ తరఫు న్యాయవాదులు వాదించారు. అందువల్ల తదనంతర చర్యలు, అరెస్ట్ నుంచి రక్షణ కల్పించాలని కోర్టును జగన్ తరఫు న్యాయవాదులు కోరారు. దీనితో రెండు వారాల పాటు తదనంతర చర్యలపై హైకోర్టు స్టే విధించింది.
YS Jagan – Singayya Case
కాగా, ఇటీవల మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి… పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం రెంటపాళ్ల పర్యటన సందర్భంగా సింగయ్య అనే వృద్ధుడు మృతిచెందాడు. జగన్ ప్రయాణిస్తున్న కారు కిందపడి ప్రాణాలు కోల్పోయాడు. తొలుత జగన్ కాన్వాయ్ వాహనం ఢీకొని వృద్ధుడు చనిపోయాడని వార్తలు వచ్చినప్పటికీ నాలుగు రోజుల తర్వాత జగన్ కారు కిందే సింగయ్య పడిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ క్రమంలో జగన్ సహా పలువురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో హైకోర్టును జగన్ ఆశ్రయించారు. తమపై పెట్టిన కేసును కొట్టివేయాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు రెండు వారాలపాటు స్టే విధించింది.
Also Read : Vallabhaneni Vamsi: నకిలీ ఇళ్ల పట్టాల కేసులో వల్లభనేని వంశీకి బెయిల్
