YS Jagan: అసెంబ్లీలో జగన్, రఘురామ రాజు మధ్య ఆసక్తికర సంభాషణ !
అసెంబ్లీలో జగన్, రఘురామ రాజు మధ్య ఆసక్తికర సంభాషణ !
YS Jagan: ఏపీ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. మాజీ సీఎం జగన్, ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఒకరుకొకరు ఎదురుపడ్డారు. ఈ సందర్భంగా వారిద్దరి మధ్య ఆశక్తికరమైన సంభాషణ జరిగింది. ఈ సందర్భంగా సమావేశాలు జరిగినన్ని రోజులూ సభకు రావాలని, ప్రతిపక్షం లేకపోతే ఎలా అని జగన్ ను రఘురామ కోరగా… అసెంబ్లీకు రెగ్యులర్ గా వస్తా.. మీరే చూస్తారని జగన్(YS Jagan) బదులిచ్చారు. దీనితో వాళ్లిద్దరూ ఇంకా ఏం మాట్లాడుకున్నారనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అదేసమయంలో జగన్ ప్రక్కన తనకు సీటు కేటాయించాలని ఆర్ధిక మంత్రి పయ్యావుల కేశవ్ ను రఘురామ కోరగా… తప్పనిసరిగా అంటూ కేశవ్ నవ్వుకుంటూ లాబీలోనికి వెళ్ళిపోయినట్లు తెలుస్తోంది.
YS Jagan Meet
2019 ఎన్నికల్లో నర్సాపురం ఎంపీగా వైసీపీ తరపున గెలిచిన రఘురామకృష్ణం రాజు… కొద్ది నెలలకే ప్రభుత్వంపై తిరుగుబాటు చేసారు. ఈ నేపథ్యంలో అప్పటి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. వైసీపీ ప్రభుత్వం, జగన్(YS Jagan) తీరును రచ్చబండ అనే కార్యక్రమం ద్వారా ఎప్పటికప్పుడు ఎండగట్టేవారు. ఈ క్రమంలో రఘురామకృష్ణం రాజుపై రాజద్రోహం కేసు నమోదు చేసిన ఏపీ సీఐడీ… అరెస్ట్ చేసి కస్టోడియల్ టార్చర్ చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంది. సీఐడీ చీఫ్ పీవీ సునీల్ కుమార్ పై అప్పట్లో రఘురామకృష్ణం రాజు పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తూ… ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారారు.
అయితే 2024 ఎన్నికలకు వచ్చేసరికి రఘురామకృష్ణం రాజు టీడీపీలో చేరి… ఉండి అసెంబ్లీ నుండి గెలుపొందారు. గత ప్రభుత్వంలో తనపై జరిగిన కస్టోడియల్ టార్చర్ పై ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేసారు. ఆ ఫిర్యాదులో పీవీ సునీల్ కుమార్ తో పాటు అప్పటి ముఖ్యమంత్రి జగన్ కూడా నిందితులుగా చేర్చారు. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చిన తరువాత వైసీపీ అధినేత జగన్ పై మొదటి కేసు నమోదు చేసారు. ఈ నేపథ్యంలో జగన్, రఘురామ ఏం మాట్లాడుకున్నారనేదానిపై చర్చ జరుగుతోంది.
Also Read : Maddali Giridhar: గుంటూరులో వైసీపీకి బిగ్ షాక్ ! మాజీ ఎమ్మెల్యే గిరిధర్ రాజీనామా !