YS Jagan : జ‌గ‌నన్న విద్యా దీవెన‌కు లైన్ క్లియ‌ర్

ఆదేశాలు జారీ చేసిన సీఎం జ‌గ‌న్

YS Jagan : ఏపీ సీఎం సందింటి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంటూ ముందుకు వెళుతున్నారు. ఆయ‌న కొలువు తీరాక ప్ర‌ధానంగా విద్య‌, వైద్యం, ఉపాధి, ప‌రిశ్ర‌మ‌ల ఏర్పాటు, మ‌హిళా సాధికార‌త‌, వ్య‌వ‌సాయ రంగాల‌కు ఎక్కువ‌గా ప్ర‌యారిటీ ఇస్తూ వ‌చ్చారు.

దేశంలో ఎక్క‌డా లేని రీతిలో నాడు నేడు విద్యా ప‌థ‌కానికి శ్రీ‌కారం చుట్టారు. తెలంగాణ‌కు చెందిన సీనియ‌ర్ ఐఏఎస్ అధికారి ఆకునూరి ముర‌ళిని క‌న్స‌ల్టెంట్ గా నియ‌మించారు. ఏపీ ఇప్పుడు దేశానికే రోల్ మోడ‌ల్ గా మారింది.

తాజాగా ప్ర‌తిభ ఉండి ఇత‌ర దేశాల్లో చ‌దువు కోవాల‌నే వారి కోసం ప్ర‌భుత్వం త‌ర‌పున సాయం చేసేందుకు జ‌గ‌న‌న్న విదేశీ విద్యా దీవెన ప‌థ‌కానికి శ్రీ‌కారం చుట్టారు.

ఇందుకు సంబంధించి ఉత్త‌ర్వులు కూడా జారీ చేసింది ప్ర‌భుత్వం. పైరీల‌కు తావు లేకుడా ప్ర‌తిభ‌కు ప‌ట్టం క‌ట్ట‌నున్నారు. ప్ర‌త్యేకంగా ఆర్థికంగా వెనుక‌బ‌డిన కులాల వారంద‌రికీ ఈ ప‌థ‌కాన్ని వ‌ర్తింప చేసేలా నిర్ణయం తీసుకున్నారు సీఎం జ‌గ‌న్ రెడ్డి(YS Jagan).

ప్ర‌పంచంలోని మొద‌టి 200 యూనివ‌ర్శిటీల‌లో సీటు పొందిన విద్యార్థుల‌కు సంబంధించిన ఖ‌ర్చును మొత్తం ఏపీ స‌ర్కార్ భ‌రిస్తుంది.

ఇక మొద‌టి 100 ర్యాంకింగ్స్ లో ఉన్న యూనివ‌ర్శిటీల్లో సీటు సాధిస్తే పూర్తి ఫీజు రీయింబ‌ర్స్ మెంట్ వ‌ర్తిస్తుంది. నాలుగు వాయిదాల్లో చెల్లిస్తారు. ఏడాదికి రూ. 8 ల‌క్ష‌ల లోపు ఆదాయం ఉన్న వారికి ఇది అమ‌ల‌వుతుంది.

35 ఏళ్ల లోపు ఉన్న వారంద‌రూ జ‌గ‌న‌న్న విదేశీ విద్యా దీవెన ప‌థ‌కం వ‌ర్తిస్తుంద‌ని ప్ర‌భుత్వం తెలిపింది. ఇందుకు సంబంధించి ప్ర‌తి సంవ‌త్స‌రం సెప్టెంబ‌ర్ – డిసెంబ‌ర్ మ‌ధ్య గుర్తింపు కోసం నోటిఫికేష‌న్ విడుద‌ల చేస్తుంది.

Also Read : జేఈఈ మెయిన్ తొలి విడ‌త‌లో మ‌నోళ్లే టాప్

Leave A Reply

Your Email Id will not be published!