Ys Jagan : జంతువుల కొవ్వు కలిపినట్లు దుష్ప్రచారం చేశారు : వైఎస్ జగన్
జంతువుల కొవ్వు కలిపినట్లు దుష్ప్రచారం చేశారు : వైఎస్ జగన్
Ys Jagan: ఏపీలో రాక్షస పాలన రాజ్యం నడుస్తోంది నారా చంద్రబాబు నాయుడు క్షుద్ర రాజకీయాలు చేస్తున్నాడు అటూ మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి(Ys Jagan) మండిపడ్డారు. శుక్రవారం ఆయన తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, దేవుడి దర్శనానికి వెళ్తామంటే అడ్డుకునేందుకు చూస్తున్నారని.. నోటీసులు ఇచ్చి అడ్డుకునే ప్రయత్నం చేశారని ధ్వజమెత్తారు.
Ys Jagan Comment
‘‘వైఎస్సార్‌సీపీ నేతలకు నోటీసులిచ్చి అడ్డుకున్నారు. దర్శనానికి వెళ్తుంటే అడ్డుకోవడం దేశంలో ఇదే మొదటిసారి. దర్శనానికి వెళ్తామంటే అరెస్ట్ చేస్తామంటున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి బీజేపీ నేతలను తిరుపతికి రప్పించారు. బీజేపీ అగ్రనాయకత్వానికి ఈ విషయం తెలుసా?’’ అని వైఎస్ జగన్ ప్రశ్నించారు.
‘‘వేలాది మంది పోలీసులను మోహరించారు. లడ్డూ వివాదంలో డైవర్షన్ కోసమే ఇవన్నీ చేస్తున్నారు. లడ్డూ పవిత్రతను దెబ్బతీస్తూ బాబు అడ్డంగా దొరికిపోయారు. రాజకీయ దుర్భుద్ధితోనే లడ్డూ విశిష్టతను దెబ్బ తీశారు. జంతువుల కొవ్వు కలిపినట్లు దుష్ప్రచారం చేశారు. చంద్రబాబు అబద్ధాలకు రెక్కలు కట్టాడు. ఆరు నెలకొకసారి నెయ్యి కొనుగోలు టెండర్లు జరుగుతాయి. ఎల్1 ఎవరొచ్చారో వారికే టెండర్లు ఇస్తారు. దశాబ్ధాలుగా ఈ ప్రక్రియనే జరుగుతూ ఉంది. ప్రతి ట్యాంకర్ ఎన్‌ఏబీఎల్ సర్టిఫికెట్ తేవాలి. ట్యాంకర్ వచ్చాక కూడా టీటీడీ(TTD) 3 టెస్టులు చేస్తుంది. ఒక్క టెస్ట్ ఫెయిల్ అయినా ట్యాంకర్‌ను వెనక్కి పంపుతారు. బాబు హయాంలో కూడా 15 సార్లు ట్యాంకర్లను వెనక్కి పంపారు. మా హయాంలో కూడా 18 సార్లు వెనక్కి పంపాం. తిరుమలలో ఇంత గొప్ప వ్యవస్థ ఉంది.’’ అని వైఎస్ జగన్ వివరించారు.
‘‘జూలై 6, 12 తేదీల్లో నాలుగు ట్యాంకర్లు వచ్చాయి. ఆ నాలుగు ట్యాంకర్లు టెస్టులు ఫెయిల్ అయ్యాయి. టెస్టులు ఫెయిల్ అయిన 4 ట్యాంకర్లను వెనక్కి పంపారు. టెస్ట్‌లు ఫెయిల్ అయితే మైసూర్ ల్యాబ్‌కు పంపుతారు.. కానీ మొదటిసారిగా ఈ శాంపిల్స్‌ను గుజరాత్‌కు పంపారు. ట్యాంకర్లను వెనక్కి పంపి సదరు కంపెనీకి నోటీసులు ఇచ్చారు. 2 నెలల తర్వాత చంద్రబాబు యానిమల్ ఫ్యాట్ కలిసిందన్నారు. ఆ మరుసటి రోజే టీడీపీ ఆఫీస్‌లో ఎన్‌డీడీబీ రిపోర్ట్‌ను బయటపెట్టారు.’’ అని వైఎస్ జగన్ చెప్పారు.
Also Read : CM Chandrababu : శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులంతా తప్పకుండ టీటీడీ నిబంధనలు పాటించాల్సిందే