YS Jagan Vidya Deevena : విద్యార్థులకు జగనన్న తీపి కబురు
30న విద్యా దీవెన కింద నగదు జమ
YS Jagan Vidya Deevena : ఏపీ సీఎం సందింటి జగన్ మోహన్ రెడ్డి రూటే సపరేట్. ఆయన ఏది చేసినా ఓ సంచలనం. ఇప్పటికే వినూత్నమైన పథకాలతో అన్ని వర్గాల ప్రజలను ఆదుకుంటున్నారు. ఇప్పటికే నాడు నేడు కింద బడులలో మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేశారు. వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు.
అందులో భాగంగా ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాలు కేంద్ర సర్కార్ ను సైతం అబ్బుర పరిచేలా చేసింది. ఇక విద్యార్థులు చదువుకునేందుకు గాను విద్యా దీవెన పథకాన్ని అమలు చేస్తోంది ఏపీ సర్కార్ . ఇప్పటికే మూడు విడతలుగా పిల్లల తల్లుల ఖాతాల్లో నిధులు జమ చేస్తూ వచ్చారు.
తాజాగా ఈనెల 30న బుధవారం మరోసారి బటన్ నొక్కి సీఎం నిధులను జమ చేయనున్నారు. ఈ విషయాన్ని ఏపీ ప్రభుత్వం అధికారికంగా ఇవాళ వెల్లడించింది. ఈ విద్యా దీవెన పథకం కింద దాదాపు 0.85 లక్షల మంది విద్యార్థులకు(YS Jagan Vidya Deevena) లబ్ది చేకూరనుంది. ఈ పథకం కింద మొత్తం నిధులు రూ. 709 కోట్లను విద్యార్థుల పేరెంట్స్ ఖాతాల్లో నేరుగా జమ చేస్తారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిగ్రీతో పాటు పీజీ చదువుకుంటున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, ముస్లిం మైనార్టీ, కాపు, క్రిస్టియన్ మైనార్టీ విద్యార్థులకు మేలు చేకూరనుంది. ఈ నిధులను రేపు అన్నమయ్య జిల్లా మదనపల్లెలో జరిగే అధికారిక కార్యక్రమంలో విడుదల చేయనున్నారు. విద్యా దీవెన వల్ల అన్ని వర్గాలకు చెందిన పేద విద్యార్థులు చదువుకునేందుకు మేలు చేకూరనుంది.
Also Read : ఏపీలో భారీగా పోలీస్ రిక్రూట్‌మెంట్