YS Jagan : ఆగస్టు 13 నుంచి ఏపీలో జెండా పండుగ
ఏపీ సీఎం సందింటి జగన్ మోహన్ రెడ్డి
YS Jagan : 75 ఏళ్ల స్వాతంత్రం పూర్తయిన సందర్భంగా కేంద్రంలో కొలువు తీరిన మోదీ ప్రభుత్వం ఆజాదీకా అమృత్ మహోత్సవ్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అన్ని రంగాలలో లబ్ద ప్రతిష్టులైన వారిని స్మరించు కుంటోంది.
ఇదే సమయంలో భారత జాతికి గర్వకారణంగా నిలిచే జాతీయ పతకాన్ని ప్రత్యేకంగా ఆవిష్కరించేలా పలు కార్యక్రమాలు చేపట్టింది.
ఇందులో భాగంగా దేశంలోని పలు రాష్ట్రాలు తమదైన రీతిలో దూసుకెళుతున్నాయి. భిన్నమైన కార్యక్రమాలు చేపడుతూ సత్తా చాటుతున్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు సీఎం సందింటి జగన్ మోహన్ రెడ్డి(YS Jagan).
ఈ మేరకు ఎప్పటికప్పుడు సమీక్షలు చేపడుతూ తనదైన శైలిలో పాలన సాగిస్తున్నారు. తాజాగా ఏపీలో వచ్చే ఆగస్టు 13 నుంచి ఘనంగా హర ఘర్ తిరంగా కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించారు.
ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. స్పష్టమైన కార్యాచరణ ప్లాన్ రూపొందించింది. కేంద్రం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది. ఇందులో సీఎం జగన్ రెడ్డి పాల్గొన్నారు.
తాము ఆగస్టు 13 నుంచి హర్ ఘర్ తిరంగా ను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. 15 దాకా 1.62 కోట్ల జాతీయ పతాకాలను ఆవిష్కరించనున్నట్లు చెప్పారు.
రాష్ట్రంలో తాము రూపొందించిన కార్యాచరణ ప్రణాళిక గురించి వివరించారు సీఎం. దేశ భక్తిని, జాతీయ భావాలను పెంచేలా కార్యక్రమాకు శ్రీకారం చుట్టామన్నారు జగన్.
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్లా జాతీయ పతాకాలను ఎగుర వేసేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు. పరిశ్రమలతో పాటు ఇతర సంస్థలు, దుకాణాలు, వాణిజ్య సముదాయాలు అన్నింటిపైనా నేషనల్ ఫ్లాగ్ ఎగుర వేసేలా ప్లాన్ చేశామన్నారు జగన్ మోహన్ రెడ్డి(YS Jagan).
Also Read : వరద బాధితులకు సీఎం ఆసరా