YS Jagan: అవినీతికి పరాకాష్ట మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణ – వైఎస్ జగన్

అవినీతికి పరాకాష్ట మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణ - వైఎస్ జగన్

YS Jagan : కూటమి ప్రభుత్వం అవినీతికి పరాకాష్ట మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణ అని మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. బుధవారం తాడేపల్లి వైసీపీ (YSRCP) కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో… రాష్ట్రంలో తీవ్ర యూరియా కొరత, 10 కొత్త మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయం, సూపర్‌సిక్స్‌ హామీలు, సూపర్‌సిక్స్‌ సూపర్‌హిట్‌ సభ వంటి అనేక అంశాలపై మాట్లాడారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం వైఫల్యాలు, గత వైసీపీ (YSRCP) ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.

YS Jagan Slams AP Govt

ఈ సందర్భంగా వైఎస్ జగన్ (YS Jagan) మాట్లాడుతూ…. రైతులకు అందాల్సిన ఎరువులు, యూరియాను బ్లాక్‌ మార్కెట్‌ చేస్తూ కూటమి నాయకులు స్కామ్‌కు పాల్పడుతున్నారని ఆరోపించారు. యూరియా కోసం రైతులు పడుతున్న అవస్థలు చూస్తే…. రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా? అన్న సందేహం కలుగుతోంది. ఎందుకంటే అలాంటి పరిణామాలు కనిపిస్తున్నాయి. నేను ఒకటే అడుగుతున్నాను. ప్రజలంతా ఆలోచించాలి. మా పాలనలో 5 ఏళ్లలో ఎక్కడైనా, ఎప్పుడైనా రైతులు ఇలా ఎరువుల కోసం అగచాట్లు పడ్డారా? రోడ్డెక్కారా? మరి ఆ పరిస్థితి ఎందుకు రాలేదు? ఇప్పుడు చంద్రబాబు (CM Chandrababu) హయాంలో మాత్రమే ఎందుకు జరుగుతోంది? అదీ ప్రభుత్వమే. ఇదీ ప్రభుత్వమే. అప్పుడు, ఇప్పుడూ ఆ అధికారులే ఉన్నారు. ఇప్పటి పరిస్థితికి కారణం.. జగన్‌ (YS Jagan) అనే వ్యక్తికి రైతుల మీద ఆపేక్ష. వారికి మంచి చేయాలన్న తపన, తాపత్రయం. నాటి సీఎంకు, ఇప్పటి సీఎంకూ అదే తేడా అని అన్నారు.

YS Jagan – మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ స్కామ్‌లకు పరాకాష్ట

రాష్ట్రంలో ప్రజారోగ్య రంగాన్ని కూడా చంద్రబాబు (CM Chandrababu) దారుణంగా దెబ్బ తీస్తున్నాడు. సంపద సృష్టిస్తానని ఎన్నికల ముందు చెప్పి, ఇప్పుడు ప్రభుత్వ ఆస్తులను శనక్కాయలు, బెల్లానికి అమ్ముకంటున్నారు. తన మనుషులకు దోచి పెడుతున్నారు. ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణ. తారాస్థాయికి చేరిన చంద్రబాబు అవినీతి, స్కామ్‌లకు పరాకాష్ట. నాది ఒక ప్రశ్న.
ప్రజలు కూడా ఆలోచించాలి. అసలు ప్రభుత్వం స్కూళ్లు నడుపుతోంది? దాదాపు 45 వేల స్కూళ్లు. బస్సులను కూడా ప్రభుత్వం ఎందుకు నడుపుతోంది? ఎందుకంటే, ప్రభుత్వం వాటిని చేయకపోతే, పేదలు, మధ్యతరగతి ప్రజలు బ్రతకలేరు. ప్రైవేటు వారి ఛార్జీలను వారు తట్టుకోగలరా? అందుకే ఏ ప్రభుత్వమైనా వాటిని తన బాధ్యతగా చేస్తుంది. లేకపోతే ప్రైవేటు రంగం దోచేస్తుంది. 2019 వరకు మన రాష్ట్రంలో ఉన్న మెడికల్‌ కాలేజీలు 11. పద్మావతి వర్సిటీ కాలేజీ కూడా కలుపుకుంటే, వాటి సం«ఖ్య 12. చంద్రబాబు (CM Chandrababu) తన 14 ఏళ్ల పాలనలో కనీసం ఒక్కటంటే, ఒక్క మెడికల్‌ కాలేజీ అయినా కట్టాడా? కనీసం ఆ ఆలోచన అయినా చేశాడా?.
ఒకేసారి 17 మెడికల్‌ కాలేజీల నిర్మాణం
వైసీపీ (YSRCP) అధికారంలో ఉండగా కేవలం 5 ఏళ్ల లోనే ప్రతి జిల్లాకు ఒక టీచింగ్‌ హాస్పిటల్‌ తీసుకురావాలని, ఒక మెడికల్‌ కాలేజీ ఏర్పాటు చేయాలని చూశాం. జిల్లాలు 13 నుంచి 26కు పెంచి, ప్రతి జిల్లాలో మెడికల్‌ కాలేజీ ఏర్పాటు చేశారు. ఎప్పుడైతే ఒక జిల్లాలో మెడికల్‌ కాలేజీలో భాగస్వామ్యంగా టీచింగ్‌ హాస్పిటల్‌ ఏర్పాటైతే, అక్కడ సూపర్‌ స్పెషాలిటీ వైద్య సేవలు అందుతాయి. ఆ స్థాయిలో వైద్యులు, వైద్య సిబ్బంది అందుబాటులోకి వస్తారు. ఒక మెడికల్‌ కాలేజీ అందుకు హబ్‌గా పని చేస్తూ, ఆ జిల్లాలో అన్ని ప్రభుత్వ ఆస్పత్రులకు ఒక గైడింగ్‌గా పని చేస్తుంది. మంచి వైద్యం ఉచితంగా అందుతుంది. దాంతో ప్రైవేటు ఆస్పత్రుల దోపిడి ఆగిపోతుంది.  ఎక్కువ ఫీజులు గుంజితే, ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్తారు.
ఇంకా దాని వల్ల ప్రతి జిల్లాలో అదనంగా మెడికల్‌ సీట్లు (Medical Seats) అందుబాటులోకి వస్తాయి. ఒకవైపు నాణ్యతతో కూడిన వైద్య విద్య, మరోవైపు ప్రతి జిల్లాలో సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రుల వైద్య సేవలందుతాయి. దీన్నే విజన్‌ అంటారు. ప్రజలకు ఏది అవసరం? ఏది ముఖ్యం? ఏది కచ్చితంగా చేయాలి? అనేది ఒక విజన్‌. మా హయాంలో 17 మెడికల్‌ కాలేజీల పనులు. ఒక్కో దానికి రూ.500 కోట్లు ఖర్చు చేశాం. ప్రతి కాలేజీని 50 ఎకరాల్లో చేపట్టాం. అన్ని హంగులతో వాటి నిర్మాణం చేపట్టాం. అవన్నీ అందుబాటులోకి వస్తే, వ్యాధులు వ్యాప్తి చెందితే, మంచి వైద్య సేవలు అందుతాయి.
మెడికల్‌ సీట్లు (Medical Seats) పెరుగుతాయి. రెండేళ్లు కోవిడ్‌తో ఇబ్బంది పడినా వెనక్కు తగ్గలేదు. అంత అంకితభావంతో పని చేశాం కాబట్టే.. 2023–24లో విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాలలో మెడికల్‌ కాలేజీలు ప్రారంభించాం. తరగతులు కూడా మొదలయ్యాయి. అవే కాకుండా, గత ఏడాది ఎన్నికల నాటికి, పాడేరు, పులివెందుల మెడికల్‌ కాలేజీల నిర్మాణం పూర్తి చేశాం. అడ్మిషన్లకు సిద్ధం చేశాం. పులివెందుల కాలేజీని ప్రారంభించాం ఎన్నికలు ముగిశాక, పాడేరు మెడికల్‌ కాలేజీ కూడా సిద్ధమైంది. అంటే, మా హయాంలో చేపట్టిన 17 మెడికల్‌ కాలేజీల్లో 7 కాలేజీలను పూర్తి చేశాం.
చంద్రబాబు (CM Chandrababu) ఎంత దుర్మార్గుడు అంటే, పులివెందుల మెడికల్‌ కాలేజీకి ఎన్‌ఎంసీ (జాతీయ వైద్య కమిషన్‌) 50 సీట్లు కేటాయించి, భర్తీ చేయడానికి అనుమతి ఇస్తే, ఆ సీట్లు వద్దంటూ చంద్రబాబు లేఖ రాశాడు. అంత మంచి కాలేజీలో సీట్లు వద్దని చంద్రబాబు (CM Chandrababu) లేఖ రాశాడు. అలాంటి సీఎం దేశంలో ఎక్కడైనా ఉంటాడా?. చంద్రబాబు అసలు మనిషా? లేక రాక్షసుడా? ఆలోచించండి.
మేము నిర్దేశించుకున్న ప్రణాళిక ప్రకారం, చంద్రబాబు (CM Chandrababu) కూడా చొరవ చూపి ఉంటే.. 2024–25లో మరో 4 కాలేజీలు.. అదోని, మదనపల్లె, మార్కాపురం, పిడుగురాళ్లలో క్లాస్‌లు మొదలై ఉండేవి. ఆ మేరకు నిర్మాణాలు కొనసాగించాం. గత ఏడాది మేం దిగిపోయే నాటికి ఆయా కాలేజీల పనులు ఏ దశలో ఉన్నాయో చూపాం. ఇంకా మా ప్లాన్‌ ప్రకారం ముందుకు వెళ్లి ఉంటే, మరో 6 మెడికల్‌ కాలేజీలు.. అమలాపురం, బాపట్ల, నర్సీపట్నం, పార్వతీపురం, పాలకొల్లు, పెనుకొండలో మెడికల్‌ కాలేజీలు 2025–26 విద్యా సంవత్సరంలో మొదలై ఉండేవి. ఆ దిశలో పక్కా ప్రణాళిక ప్రకారం మేము పనులు చేశాం.
మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణ అడ్డుకుంటాం
కూటమి ప్రభుత్వం స్కామ్‌ ల్లో పరాకాష్ట మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణ. దీన్ని గట్టిగా  అడ్డుకుంటాం. నిరసనలు, ర్యాలీలు చేస్తాం. నేనూ అక్కడక్కడా పాల్గొంటా. రాష్ట్ర శ్రేయస్సు కోరే ప్రతి ఒక్కరిని, పార్టీని కోరుతున్నా. అందరూ కలిసి రండి. కొత్త మెడికల్‌ కాలేజీలు మన సంపద. రాష్ట్ర సంపద. అందరం కలిసి పోరాడుదాం. వాటిని కాపాడుకుంటాం. అయినా ఆ ప్రభుత్వం వాటిని ప్రైవేటీకరిస్తే, రేపు మా ప్రభుత్వం రాగానే, అన్నీ రద్దు చేస్తాం. కాలేజీలు వెనక్కు తీసుకుంటాం.
ఆరోగ్యశ్రీ నిర్వీర్యం
చంద్రబాబునాయుడు హయాంలో వైద్య రంగం పూర్తిగా నాశనం అయిపోతోంది. నాడు మా ప్రభుత్వ హయాంలో ఆరోగ్యశ్రీలో 3,257 ప్రొసీజర్లు. రూ.25 లక్షల వరకు వైద్యం వ్యయ పరిమితి. వార్షికాదాయం రూ.5 లక్షలు ఉన్న వారికి కూడా పథకాన్ని వర్తింప చేయడం వల్ల దాదాపు 95 శాతం కవర్‌ అయ్యారు.  ఆరోగ్యశ్రీ పథకం కోసం నెలకు రూ.300 కోట్లు కావాలి. 15 నెలలకు రూ.4500 కోట్లు కావాల్సి ఉంటే, చంద్రబాబు ఇచ్చింది రూ.600 కోట్లు మాత్రమే. దాంతో కార్పొరేట్‌ ఆస్పత్రులు పథకంలో వైద్యం చేయడం లేదు. ఇంకా మా హయాంలో అమలు చేసిన ఆరోగ్య ఆసరా పూర్తిగా ఎత్తేశారు.
ఇన్సూరెన్స్‌ పేరుతో కొత్త మోసం
ఇన్ని చేసిన చంద్రబాబు, మరో మోసం కోసం డ్రామా చేస్తున్నాడు. కొత్తగా ఇన్సూరెన్స్‌ తీసుకొచ్చాడు. దానిలో వైద్యం ఖర్చును కేవలం రూ.2.5 లక్షలకే పరిమితం చేయడంతో పాటు, ప్రొసీజర్లను 2500కు తగ్గించారు. అంటే ఖరీదైన క్యాన్సర్‌ ట్రీట్‌మెంట్‌ వంటి ప్రొసీజర్లు కట్‌ చేశారు ఆరోగ్యశ్రీకి ఏటా రూ.3600 కోట్లు ఖర్చు చేయడానికి మనసు రాని వ్యక్తి.. నిజంగానే రూ.25 లక్షల వరకు ఇన్సూరెన్స్‌ చేయాలంటే ప్రీమియమ్‌ దాదాపు రూ.6 వేల కోట్లు అవుతుంది. ఇది మరో మోసం కాదా?. విలేజ్‌ క్లినిక్స్‌ లేవు. ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ లేదు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మందులు లేవు. చివరకు దూది కూడా లేదు. ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరా లేదు. నాడు–నేడు పనులు పూర్తిగా ఆగిపోయాయి.
ఎన్నో చేశాం కానీ చెప్పుకోలేకపోయాం
 నిజంగా మా వైసీపీ హయాంలో మేం చేసింది చాలా ఎక్కువ… చెప్పుకున్నది తక్కువ. మాకు చేత కాలేదు. మెడికల్‌ కాలేజీలు కాక పలాసలో కిడ్నీ రీసెర్చ్‌ సెంటర్‌. శ్రీకాకుళంలో కిడ్నీ వ్యాధిగ్రస్తులకు పర్మినెంట్‌ సొల్యూషన్‌ చూపించాం. దాదాపు 100 కోట్ల ప్రాజెక్టు.
ఎస్వీ మెడికల్‌ కాలేజీలో బాలికల హాస్టల్‌.. కడప జీజీహెచ్‌లో  ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెంటల్‌ హెల్త్, సూపర్‌ స్పెషాలిటీ బ్లాక్‌.. కడపలో క్యాన్సర్‌ కేర్‌ సెంటర్‌.. రిమ్స్‌ జీజీహెచ్‌ కడపలో అండర్‌ గ్రాడ్యుయేట్‌ సీట్లను పెంచాం.. కర్నూలులో డయాగ్నొస్టిక్‌ బ్లాక్, యూజీ, పీజీ బాలికల హాస్టల్‌.. ట్రామా కేర్‌ బ్లాక్‌ ఎట్‌ కాకినాడ.. సెంటర్‌ ఫర్‌ ఎక్స్‌లెన్స్‌ ఇన్‌ విశాఖ ప్రభుత్వ ఆస్పత్రి.. సిటీ డయాగ్నొస్టిక్‌ సెంటర్‌ అండ్‌ రీజనల్‌ డ్రగ్‌ స్టోర్‌ ఎట్‌ విజయవాడ.. పీజీ మెన్స్‌ హాస్టల్, ఎస్వీ మెడికల్‌ కాలేజీ ఎట్‌ తిరుపతి.. సిటీ డయాగ్నొస్టిక్‌ సెంటర్, రీజనల్‌ డ్రగ్స్‌ స్టోర్‌ ఎట్‌ తిరుపతి.. బర్న్స్‌ వార్డు ఇన్‌ అనంతపురం హాస్పిటల్‌.. స్టేట్‌ క్యాన్సర్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఎట్‌  కర్నూలు, రిమ్స్‌ జీజీహెచ్‌ శ్రీకాకుళం.. సిటీ డయాగ్నొస్టిక్‌ సెంటర్‌ రీజనల్‌ డ్రగ్స్‌ స్టోర్‌ విశాఖపట్నం, బర్న్స్‌ వార్డు జీజీహెచ్‌ కర్నూలు, కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లు.. ఇవన్నీ మచ్చుకు మాత్రమే. ఇంకా పీహెచ్‌సీలు, విలేజ్‌ క్లినిక్స్, అర్బన్‌ క్లినిక్స్‌ కూడా ఉన్నాయి. మేం చేసింది మేం చెప్పుకోవడం చేతకాదు. అదే ప్రాబ్లమ్‌. చెప్పాలంటే ఇంకా చాలా ఉన్నాయి, తిరుపతిలో ఛైల్డ్‌ పీడియాట్రిక్‌ సెంటర్, ఐటీడీఏ పరిధిలో కట్టిన ఆస్పత్రులు వంటివి చాలా ఉన్నాయి.
‘సూపర్‌హిట్‌’ పేరుతో బలవంతపు సంబరాలు 
చంద్రబాబుకు ఉన్న నైపుణ్యం. కళ్లార్పకుండా పచ్చి అబద్ధాలు చెప్పడం. అది ఆయనకు మాత్రమే తెలుసు. ఒకవైపు పథకాల అమలు లేదు. మరోవైపు మోసం. అయినా సూపర్‌సిక్స్‌ సూపర్‌హిట్‌ అంటూ వేడుక. ఇది అట్టర్‌ఫ్లాప్‌ అయిన సినిమాకు బలవంతంగా విజయోత్సవం చేసినట్లు ఉంది. ఈ ప్రభుత్వంలో ఇసుక, మట్టి దోచేస్తున్నారు. ఇసుక ఉచితం లేనే లేదు. లిక్కర్‌ మాఫియా. పర్మిట్‌రూంలు, బెల్టు షాప్‌లు విచ్చలవిడిగా.
అక్కడ ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరకు విక్రయాలు. ప్రభుత్వ ఆదాయం తగ్గుతోంది. మద్యం మాఫియా దోచేస్తోంది. ఇంకా సిలికా, క్వార్ట్‌›్జ దోపిడి. అమరావతిలో నిర్మాణ వ్యయం చదరపు అడుగుకు రూ.10 వేలు. అదో దోపిడి. నిజానికి చదరపు అడుగుకు రూ.4500తో బెంగళూరు వంటి నగరంలో కూడా లగ్జరీ నిర్మాణం చేయొచ్చు. ఇంకా శనక్కాయలు, బెల్లానికి ఇష్టం వచ్చినట్లుగా.. ఉర్సా, లులూకు భూముల కేటాయింపు చేస్తున్నారు. ఒకవైపు రాష్ట్ర ఆదాయం తగ్గుతోంది. మరోవైపు మీ ఆదాయం, మీ అనుయాయుల సంపద పెరుగుతోంది.

Leave A Reply

Your Email Id will not be published!