YS Jagan : సీఎం చంద్రబాబు పై మాజీ సీఎం వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు

మనం కూడా అలాంటి హామీలు ఇద్దామని చాలామంది నాతో అన్నారు...

YS Jagan : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరోసారి విరుచుకుపడ్డారు. ఉమ్మడి అనంతపురం జిల్లా స్థానిక సంస్థల ప్రతినిధులు, పార్టీ నాయకులతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి(YS Jagan) గురువారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నేతలతో జగన్ ముఖ్య విషయాలపై చర్చ జరిపారు. ఆరు నెలలు తిరక్కముందే చంద్రబాబు ప్రభుత్వంమీద తీవ్ర వ్యతిరేకత ఉందని.. ఇంతటి వ్యతిరేకత గతంలో ఏ ప్రభుత్వం మీదా లేదని తెలిపారు. ‘‘ప్రతి కుటుంబానికి మనం మంచిచేశాం.. కానీ చంద్రబాబు(CM Chandrababu) అంతకంటే ఎక్కవ చేస్తానంటూ, ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరికీ ఒక హామీ ఇచ్చారు. మనం కూడా అలాంటి హామీలు ఇద్దామని చాలామంది నాతో అన్నారు.గడచిన ఐదేళ్లలో చరిత్రలో ఎప్పుడూ చూడని మార్పులు తీసుక వచ్చాం. ఎన్నికల మేనిఫెస్టోను పూర్తిగా అమలు చేశాం. మేనిఫెస్టోకు పవిత్రత తీసుకువచ్చాం, ప్రతి హామీని తూచా తప్పకుండా అమలు చేశాం’’ అని మాజీ ముఖ్యమంత్రి అన్నారు.

YS Jagan Comments

‘‘కోవిడ్‌ లాంటి సమస్యలు వచ్చినా, ప్రభుత్వ ఆదాయాలు తగ్గినా, ఖర్చు పెరిగినా, సాకులు చూపకుండా, కారణాలు చెప్పకుండా ఎన్నికల వేళ ఇచ్చిన హామీలను, వాగ్దానాలను అమలు చేశాం. బడ్జెట్లోనే సంక్షేమ క్యాలెండర్‌ ప్రకటించాం. క్యాలెండర్‌ ప్రకారం ప్రతి పథకాన్ని అమలు చేశాం. చంద్రబాబు మాటలను పదిశాతం ప్రజలు కూడా నమ్మారు, నమ్మించగలిగారు. అందుకనే పరాజయం పాలయ్యాం. జగన్‌ చేశారు కదా.. చంద్రబాబు కూడా చేస్తారేమోనని కొంతమంది అనుకున్నారు. ఆరునెలలు కూడా గడవకముందే చంద్రబాబు మోసాలు, అబద్ధాలు మన అందరికీ స్పష్టంగా కనిపిస్తున్నాయి. చంద్రబాబును నమ్మడమంటే.. చంద్రముఖిని లేపడమే, పులినోట్లో తలపెట్టడమే అని ఆరోజు చెప్పాను. దాన్ని ఇవాళ చంద్రబాబుగారు నిజం చేస్తున్నారు’’ అని వ్యాఖ్యలు చేశారు.

జగన్‌పలావు పెట్టారని.. చంద్రబాబు బిర్యానీ పెడతానని అన్నారని ఇప్పుడు పలావు పోయిందీ, బిర్యానీ పోయిదన్నారు. ఉన్న పథకాలు పోయాయని.. ఇస్తానన్న పథకాలు రావడంలేదని విమర్శించారు. ఇప్పుడు ప్రజలపై బాదుడే బాదుడు పూనుకున్నారని అన్నారు.ఆరునెలల్లోనే వేల కోట్లకుపైగా భారాన్ని ప్రజలపై కరెంటు ఛార్జీల రూపంలో వేశారని విమర్శించారు. రాష్ట్రంలో రెడ్‌ బుక్‌ రాజ్యాంగం నడుస్తోందని.. స్కామ్‌లమీద స్కాంలు నడుస్తున్నాయని ఆరోపించారు. శాండ్ మాఫియా, లిక్కర్‌ మాఫియా.. ఇలా మాఫియాలు నడుస్తున్నాయన్నారు. మైనింగ్‌ జరగాలన్నా, ఏ కాంట్రాక్టు చేయాలన్నా ప్రతి ఎమ్మెల్యే నుంచి మొదలుకుని ముఖ్యమంత్రి వరకూ నాకింత.. నీకింత నడుస్తోందని అన్నారు.

Also Read : Ravichandran Ashwin : తమ కొడుకుని టార్చర్ చేసారంటూ అశ్విన్ తండ్రి సంచలన వ్యాఖ్యలు

Leave A Reply

Your Email Id will not be published!