YS Sharmila Dharna : కాళేశ్వరం అవినీతిపై నిగ్గు తేల్చండి
సీబీఐతో విచారణ చేపట్టాలన్న షర్మిల
YS Sharmila Dharna : కాళేశ్వరం ప్రాజెక్టులో అంతులేని అవినీతి చోటు చేసుకుందని వెంటనే కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐతో విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు వైఎస్సార్ తెలంగాణ పార్టీ చీఫ్ వైఎస్ షర్మిల(YS Sharmila Dharna). సోమవారం దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆమె ధర్నా చేపట్టారు. కేసీఆర్ హఠావో తెలంగాణ బచావో అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేపట్టారు.
కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో వేల కోట్ల రూపాయలు కమీషన్ రూపంలో కల్వకుంట్ల కుటుంబానికి దక్కాయంటూ సంచలన ఆరోపణలు చేశారు వైఎస్ షర్మిల. రీ డిజైనింగ్ పేరుతో కాళేశ్వరం ప్రాజెక్టును మూడు రెట్లు ఖర్చు పెంచారంటూ మండిపడ్డారు. కేవలం కమీషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారంటూ ఆరోపించారు.
దీని వల్ల రైతులకు ఎలాంటి ఉపయోగం లేదన్నారు. ఆయన పాలనలో పాలన పడకేసిందన్నారు. ప్రజా సమస్యలను గాలికి వదిలి వేశారంటూ మండిపడ్డారు. ప్రజల చెవుల్లో పూలు పెడుతున్నారంటూ ధ్వజమెత్తారు.
ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టుకు లక్షా 20 వేల కోట్లను ఖర్చు చేశారని ..ఇంత చేసినా కేవలం 18 లక్షల 25 వేల 700 ఎకరాలకు మాత్రమే సాగు నీరు వస్తే ఎలా అని సీఎంను నిలదీశారు. రాష్ట్రంలో పూర్తిగా దోచుకో దాచుకో అన్నట్టుగా కేసీఆర్ ప్రభుత్వం పని చేస్తోందని ధ్వజమెత్తారు.
కేవలం రూ. 38 వేల కోట్లతో పూర్తయ్యే ప్రాజెక్టును సీఎం కేసీఆర్ రీ డిజైనింగ్ పేరుతో రూ. 1.20 లక్షల కోట్లకు పెంచారని ధ్వజమెత్తారు వైఎస్సార్ టీపీ పార్టీ చీఫ్ వైఎస్ షర్మిల(YS Sharmila). అందుకే తాము ఈ మొత్తం అవినీతిపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. ఆయనను గద్దె దించేంత వరకు తాము పోరాడుతూనే ఉంటామన్నారు.
Also Read : జనసేనానికి ‘నాదెండ్ల’ బలం