YS Sharmila: జగన్ మూర్ఖత్వానికి ఆయన్ను మ్యూజియంలో పెట్టాలి – షర్మిల

జగన్ మూర్ఖత్వానికి ఆయన్ను మ్యూజియంలో పెట్టాలి - షర్మిల

YS Sharmila: వైకాపా అధ్యక్షుడు జగన్ మూర్ఖత్వానికి ఆయన్ను మ్యూజియంలో పెట్టాలని ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల(YS Sharmila) ధ్వజమెత్తారు. అసెంబ్లీకి వచ్చి చంద్రబాబును నిలదీయాలని చెబితే.. ఆయనకు కొమ్ముకాసినట్లుందా? అని ప్రశ్నించారు. జగన్ అద్దంలో చూసుకుంటే ఇప్పుడు కూడా ఆయనకు చంద్రబాబే కనిపిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఈ మేరకు ‘సోషల్ మీడియా’ వేదికగా జగన్ మోహన్ రెడ్డీ తీవ్రంగా విమర్శలు చేశారు. ‘‘సామాజిక మాధ్యమాల్లో నన్ను కించపరిచేంత ద్వేషం ఉంది. మాకు అలాంటి ద్వేషం లేదుగానీ, తప్పును తప్పు అని చెప్పే ధైర్యం ఉంది. ఒక ప్రతిపక్షం మరో ప్రతిపక్షాన్ని ప్రశ్నించకూడదని ఎక్కడైనా ఉందా? తప్పు చేస్తే ఏ పార్టీనైనా ప్రశ్నించే అధికారం మాకుంది. జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్లకపోవడం సభను గౌరవించకపోవడం తప్పు. అందుకే రాజీనామా చేయ్యాలి అంటున్న.

YS Sharmila Comment

వైఎస్ఆర్ విగ్రహాలను కూల్చేస్తే.. స్వయంగా అక్కడికి వెళ్లి, ధర్నా చేస్తానని అధికార పార్టీ నాయకులు, కార్యకర్తలను హెచ్చరించి నేనే. అసలు మీరు అధికారంలోకి వచ్చాక ఎన్టీఆర్ విగ్రహాలను కూల్చకుండా ఉంటే.. ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదు. మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు మార్చకపోయి ఉంటే.. ఈరోజు వైఎస్ఆర్కు ఇంత అవమానం జరిగి ఉండేది కాదు. వైకాపాలో వైఎస్ఆర్ని, విజయమ్మను అవమానించిన వాళ్లే పెద్దవాళ్లు కదా. అసెంబ్లీలో పోరాడటం మీకు చేతకాదు. మీ అహంకారమే మీ పతనానికి కారణం’’ అంటూ తీవ్ర స్థాయిలో విమర్శించారు.

Also Read : Srisailam Dam: శ్రీ శైలం ప్రాజెక్టు గేట్ల ఎత్తివేత.. కృష్ణమ్మ పరవళ్లు !

Leave A Reply

Your Email Id will not be published!