YS Sharmila: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను కలిసిన ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల !
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను కలిసిన ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల !
YS Sharmila: ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల… జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను బుధవారం హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఆమె కుమారుడు వైఎస్ రాజారెడ్డి వివాహానికి హాజరుకావాలని కోరుతూ ఆహ్వానపత్రికను పవన్ కళ్యాణ్ కు అందించారు. ఈ సందర్భంగా కాబోయే నూతన జంట వివరాలను షర్మిలను అడిగి పవన్ తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఏపీ పీసీసీ చీఫ్ గా నియమితులైన షర్మిలకు… పవన్ పుష్పగుచ్ఛం ఇచ్చి పవన్ అభినందనలు తెలిపారు.
YS Sharmila Met Pawan Kalyan
వైఎస్ షర్మిల-బ్రదర్ అనిల్ కుమార్ ల వారసుడు వైఎస్ రాజారెడ్డి… అట్లూరి ప్రియ అనే అమ్మాయిని ప్రేమించి పెళ్ళి చేసుకోబోతున్న విషయం తెలిసిందే. రాజారెడ్డి-ప్రియల నిశ్చితార్థం జనవరి 18న, వివాహం ఫిబ్రవరి 17న జరగనున్న విషయం కూడా తెలిసిందే. ఈ వివాహనికి సంబంధించిన బ్రదర్ అనిల్- వైఎస్ షర్మిల(YS Sharmila) కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా వైఎస్ షర్మిల తెలుగు రాష్ట్రాల్లోని పలువురు రాజకీయ ప్రముఖులను పెళ్లికి ఆహ్వానిస్తున్నారు. ఇప్పటికే తెలంగాణా సిఎం రేవంత్ రెడ్డి, టీడీపీ అధినేత చంద్రబాబు సహా తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు మంత్రులు, మాజీ మంత్రులకు ఆమె స్వయంగా ఆహ్వానాలు అందజేసింది. ఈ క్రమంలోనే బుధవారం హైదరాబాద్ లోని పవన్ కళ్యాణ్ నివాసంలో ఆయన్ను కలిసి ఆహ్వాన పత్రిక అందజేసినట్లు తెలుస్తోంది.
Also Read : Spice Jet: ఫ్లైట్ టాయిలెట్‌లో చిక్కుకున్న ప్రయాణికుడు !