YS Sharmila : గల్లీలో సిగపట్లు ఢిల్లీలో కౌగిలింతలు
వైఎస్సార్ తెలంగాణ పార్టీ చీఫ్ షర్మిల
YS Sharmila : వైస్సార్ తెలంగాణ పార్టీ చీఫ్ వైఎస్ షర్మిల నిప్పులు చెరిగారు. ఆమె భారత రాష్ట్ర సమితి , భారతీయ జనతా పార్టీలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ట్విట్టర్ వేదికగా సంచలన ఆరోపణలు చేశారు. గల్లీలో కొట్టుకున్నట్లు చేయడం ఢిల్లీలో కౌగిలించు కోవడం ఇరు పార్టీలకు అలవాటుగా మారిందని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ , బీజేపీ రెండూ ఒక్కటేనని ప్రజలకు అర్థమై పోయిందన్నారు. అందుకే త్వరలో ఈ రెండు పార్టీలను లేకుండా చేయాలని షర్మిల పిలుపునిచ్చారు.
ఇలా ఇంకెంత కాలం మోసం చేస్తారంటూ ప్రశ్నించారు షర్మిల. బీహార్ లో జరిగిన బీజేపీయేతర పార్టీల మీటింగ్ కు కనీసం కూడా ఆహ్వానం అందలేదని పేర్కొన్నారు. బీహార్ సీఎం నితీశ్ కుమార్ బీజేపీపై బీఆర్ఎస్ చీఫ్, సీఎం కేసీఆర్ తీరు సరిగా లేదంటూ చెప్పిన విషయాన్ని ఈ సందర్బంగా గుర్తు చేశారు . అలాగే ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ అయితే ఏకంగా బీఆర్ఎస్ ను బీజేపీకి బీ టీమ్ గా పేర్కొనడం మరిచి పోతే ఎలా అని ప్రశ్నించారు వైఎస్ షర్మిల(YS Sharmila).
తమిళనాడు మాజీ మంత్రిని ఎలా అరెస్ట్ చేశారో చూడలేదా అని పేర్కొన్నారు. తమ వద్ద సాక్ష్యాలు ఉన్నాయంటూ సీఎం కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కవిత ఇంటికి వెళ్లిన సీబీఐ ఎందుకని ఇప్పటి వరకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు. మంత్రులు, ఎమ్మెల్యేల మీద దాడులు ఉంటాయని కానీ అరెస్ట్ లు మాత్రం ఉండవన్నారు. లోపాయికారి ఒప్పందం గురించి చెబితే ప్రజలు తెలుసుకుంటారని అన్నారు. బీజేపీ సీఎంలకు అపాయింట్ మెంట్లు దొరకడం లేదు..కానీ మంత్రి కేటీఆర్ కు ఎలా దొరుకుతుందని ప్రశ్నించారు షర్మిల. దీన్ని బట్టి చూస్తే బీఆర్ఎస్, బీజేపీ మధ్య బంధం ఉందని తేలి పోయిందన్నారు.
Also Read : Amazon CEO Modi : భారత్ లో అమెజాన్ 15 బిలియన్ల పెట్టుబడి
