YS Sharmila: జగన్ పై వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు

జగన్ పై వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు

 

మాజీ సీఎం, తన సోదరుడు వైఎస్ జగన్ పై… ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసారు. తల్లిపై కేసు వేసిన కుమారుడిగా… మేనల్లుడు, మేనకోడలి ఆస్తులు కాజేసిన మేనమామగా వైఎస్ జగన్ చరిత్రలో మిగిలిపోతారని… జగన్‌ కు విశ్వసనీయత ఉందో..లేదో.. వైసీపీ వారే ఆలోచించాలంటూ షర్మిల వ్యాఖ్యానించారు. విజయవాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వక్ఫ్ సవరణ బిల్లు, పోలవరం ప్రాజెక్టు, ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోని హామీలపై ఆమె మాట్లాడారు. అనంతరం వైఎస్ జగన్ తో తనకు ఉన్న ఆస్తుల వివాదం, తన చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుపై తనదైన శైలిలో వైఎస్ జగన్ పై విరుచుకుపడ్డారు.

ఈ సందర్భంగా వైఎస్ షర్మిల మాట్లాడుతూ… సరస్వతి పవర్‌ షేర్ల ఎంవోయూపై వైసీపీ అధ్యక్షుడు జగన్‌ స్వయంగా సంతకం చేశారని అన్నారు. కానిఇప్పటి వరకు ఒక్క ఆస్తి కూడా జగన్‌ తనకు ఇవ్వలేదని చెప్పారు. ‘‘విజయమ్మకు సరస్వతి పవర్‌ షేర్లను జగన్‌ గిఫ్ట్‌డీడ్‌ కింద ఇచ్చారు. ఇచ్చిన షేర్లు మళ్లీ తనకే కావాలని ఆయన కోర్టుకు వెళ్లారు. స్వయంగా తల్లినే జగన్‌ మోసం చేస్తున్నారు. తల్లిపై కేసు వేసిన కుమారుడిగా… మేనల్లుడు, మేనకోడలి ఆస్తులు కాజేసిన మేనమామగా ఆయన చరిత్రలో మిగిలిపోతారు.

 

ఈ సందర్భంగా ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి మాట్లాడుతూ… “వైఎస్ జగన్ డబుల్ స్టాండర్డ్ రాజకీయాలు మరోసారి బయటపడ్డాయి. వక్ఫ్ బిల్లు అంశంలో వైసీపీ ద్వంద్వ వైఖరి ఖండిసున్నా. వక్ఫ్ సవరణ బిల్లును నిన్నటి వరకూ వ్యతిరేకిస్తున్నట్లు వైసీపీ కబుర్లు చెప్పింది. ఎన్డీఏకు బలం ఉన్న లోక్ సభలో వ్యతిరేకించి… కేంద్రానికి కీలకమైన రాజ్యసభలో మాత్రం అనుకూలంగా ఓటేసింది. జగన్ సూచనలతోనే రాజ్యసభలో ఆ పార్టీ ఎంపీలు వక్ఫ్ బిల్లుకు మద్దతు తెలిపారు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ఓటింగ్ తర్వాత విప్ జారీతో వైసీపీ డ్రామా ఆడింది. ఓటింగ్ తర్వాత విప్… లోక్ సభ చరిత్రలోనే లేదంటూ విమర్శలు వస్తున్నాయి. జగన్ తీరును జాతీయ మీడియా ఎండగడుతోందన్నారు.

 

చంద్రబాబుతో కలిసి షర్మిల డైవర్షన్‌ పాలిటిక్స్‌ – అంబటి

 

చంద్రబాబు ప్రభుత్వం ఎప్పుడు అధికారంలోకి వచ్చినా ఏపీకి అన్యాయం జరుగుతుందని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ… 2014లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది… ప్రత్యేక హోదా ఎగిరిపోయింది. ప్రత్యేక హోదా వద్దు ప్రత్యేక ప్యాకేజీ ముద్దు అంటూ చంద్రబాబు హోదాను తాకట్టు పెట్టారు. పోలవరాన్ని సర్వనాశనం చేసిన వ్యక్తి చంద్రబాబు’’ అంటూ అంబటి రాంబాబు దుయ్యబట్టారు. షర్మిల చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్‌ లో కీలక పాత్ర పోషిస్తుంది. చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్‌లో షర్మిల సింహభాగం పాత్ర పోషిస్తుంది. కాంగ్రెస్ పార్టీ, చంద్రబాబు కలిసి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని అన్యాయంగా 16 నెలలు జైల్లో పెట్టారు. అలాంటి కాంగ్రెస్ పార్టీలో షర్మిల చేరి, చంద్రబాబుతో కలిసి డైవర్షన్ పాలిటిక్స్‌కు పాల్పడుతుంది’’ అని అంబటి రాంబాబు మండిపడ్డారు.

Leave A Reply

Your Email Id will not be published!