YS Sharmila : ఇంకెంత కాలం లీకుల పర్వం
వైఎస్సార్ తెలంగాణ పార్టీ చీఫ్
YS Sharmila Paper Leak : వైఎస్సార్ తెలంగాణ పార్టీ చీఫ్ వైఎస్ షర్మిల(YS Sharmila) షాకింగ్ కామెంట్స్ చేశారు. ట్విట్టర్ వేదికగా ఆమె స్పందించారు. బలిదానాలు, ఆత్మ త్యాగాల ప్రాతిపదికన ఏర్పడిన తెలంగాణలో కొలువు తీరిన బీఆర్ఎస్ సర్కార్ ప్రజా సమస్యలను గాలికి వదిలేసిందని ఆరోపించారు. లీకులు, స్కామ్ లు, మాఫియాలకు అడ్డాగా మారిందన్నారు. బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ పక్కదారి పట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో 2 లక్షలకు పైగా ఖాళీలు ఉన్నాయని బిశ్వాల్ కమిటీ ఇప్పటికే తేల్చిందని కానీ 85 వేల పోస్టులు ఉన్నాయంటూ సీఎం కేసీఆర్ మోసం చేశాడని ఆరోపించారు వైఎస్ షర్మిల(YS Sharmila Paper Leak). చైర్మన్, సెక్రటరీ, సభ్యులకు తెలియకుండా ప్రశ్నా పత్రాలు ఎలా బయటకు వస్తాయని ఆమె ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం దీనికి పూర్తిగా బాధ్యత వహించాలని ఆమె స్పష్టం చేశారు. సిట్ కాకుండా సీబీఐ, ఈడీతో దర్యాప్తు చేస్తేనే అసలు వాస్తవాలు వెలుగు చూస్తాయని పేర్కొన్నారు.
ఓ వైపు టీఎస్పీఎస్సీ ప్రశ్నా పత్రాల లీకుల వ్యవహారం ముగియక ముందే వికారాబాద్ జిల్లా తాండూరలో 10వ తరగతి పరీక్షా పత్రం బయటకు రావడం విద్యా శాఖ డొల్లతనం బయట పడుతుందన్నారు. ఆయా పార్టీలన్నీ కలిసి కట్టుగా పోరాడేందుకు కలిసి రావాలని పిలుపునిచ్చారు వైఎస్ షర్మిల.
Also Read : కేసీఆర్ కు అంత డబ్బు ఎక్కడిది