YS Sharmila : సెంటిమెంట్ పేరుతో కేసీఆర్ మోసం
నిప్పులు చెరిగిన వైస్సార్ టీపీ చీఫ్
YS Sharmila : నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో కొలువు తీరిన బీఆర్ఎస్ సర్కార్ ప్రజలను మోసం చేయడంలో ముందంజలో కొనసాగుతోందని ఆరోపించారు వైఎస్సార్ తెలంగాణ పార్టీ చీఫ్ వైఎస్ షర్మిల. సోమవారం ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఈ మేరకు సీఎం కేసీఆర్ ను ఏకి పారేశారు. రాష్ట్రంలో 2 లక్షలకు పైగా జాబ్స్ ఖాళీగా ఉన్నా ఇప్పటి వరకు ఒక్క పోస్టు కూడా భర్తీ చేయలేదని ఆరోపించారు.
YS Sharmila Talk
ఉద్యమ సెంటిమెంట్ ను అడ్డం పెట్టుకుని తెలంగాణ రాష్ట్రాన్ని సర్వ నాశనం చేశాడని ఆరోపించారు వైఎస్ షర్మిల(YS Sharmila). తొలి సారి ఉద్యమం పేరు చెప్పి పవర్ లోకి వచ్చాడని, రెండో సారి ఆత్మ గౌరవం పేరుతో అధికారంలోకి వచ్చాడని మండిపడ్డారు. తన సీఎం పదవిని కాపాడుకుంటూ అవినీతిని ఏరులై పారిస్తున్నాడంటూ ధ్వజమెత్తారు షర్మిల. కుటుంబానికి పదవులను కట్టబెట్టాడని, ఉద్యమ ద్రోహులను అందలం ఎక్కించాడని ఆవేదన వ్యక్తం చేశారు.
తొమ్మిదేళ్లుగా దొర ఫామ్ హౌస్ కే పరిమితం అయ్యాడని, ఇక ఎమ్మెల్యేలు బందిపోట్ల అవతారం ఎత్తారని ఆరోపించారు . ప్రజల్ని నానా రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని రాబోయే రోజుల్లో గుణపాఠం చెప్పాలని డిమాండ్ చేశారు.
స్కాంలు, స్కీంలు, ప్రాజెక్టుల్లో అంతులేని అవినీతి చోటు చేసుకుందని కమీషన్లకు కక్కుర్తి పడి తెలంగాణను అప్పుల పాలు చేసిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందన్నారు వైఎస్ షర్మిల. ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారంటూ ధ్వజమెత్తారు. సిట్టింగ్ లకు సీట్లంటూ మేక పోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నాడంటూ ఎద్దేవా చేశారు.
Also Read : Kanna Lakshminarayana : ‘కన్నా’కు గన్ మెన్లు తొలగింపు